యాప్నగరం

ఎల్‌వోసీ వద్ద పేలుడు.. మేజర్ స్థాయి అధికారి దుర్మరణం

జమ్ము కశ్మీర్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఐఈడీ పేలిన ఘటనలో మేజర్ స్థాయి అధికారి దుర్మరణం పాలయ్యారు.

Samayam Telugu 16 Feb 2019, 6:02 pm
పుల్వామా ఉగ్రదాడి ఘటనపై దేశంలో ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతుండగానే మరో దారుణం చోటుచేసుకుంది. ఐఈడీ పేలుడు ఘటనలో ఓ మేజర్ ర్యాంక్ అధికారి దుర్మరణం పాలయ్యారు. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషెరాలో శనివారం (ఫిబ్రవరి 16) సాయంత్రం ఈ దారుణం జరిగింది. ఉగ్రవాదులు పాతిపెట్టిన బాంబును నిర్వీర్యం చేస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎల్‌వోసీ నుంచి 1.5 కి.మీ. లోపలికి వచ్చి ఉగ్రవాదులు ఈ మందుపాతరను అమర్చారు.
Samayam Telugu ied


పుల్వామా ఘటన నేపథ్యంలో నిఘా పటిష్టం చేసిన భద్రతా దళాలు.. సరిహద్దు వెంట ఆయా ప్రాంతాల్లో ఉగ్రవాదులు అమర్చిన మందుపాతరలను నిర్వీర్యం చేసే కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో నౌషెరా వద్ద ముష్కరులు అమర్చిన ఓ మందుపాతరను వెలికితీసే ప్రయత్నం చేస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. జనవరి 11న ఇదే ప్రాంతంలో జరిగిన ఎల్‌ఈడీ బ్లాస్ట్‌లో ఇద్దరు అధికారులు దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది.

మరణించిన అధికారి ఆర్మీ కాప్స్‌కు చెందిన ఇంజనీర అని తెలుస్తోంది. ఆయనకు మేజర్ స్థాయి ర్యాంక్ వచ్చింది. తాజా ఘటనతో జమ్మూకశ్మీర్‌లో మరోసారి అలజడి రేగింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.