యాప్నగరం

బస్సుపై బాంబు దాడి చేసిన మావోలు.. జవాన్‌ సహా నలుగురి మృతి

ఛత్తీస్‌గఢ్‌లో చెలరేగిన మావోయిస్టులు.. బస్సుపై బాంబులతో దాడి.. నలుగురు మృతి. కూంబింగ్ ముమ్మరం చేసిన భద్రతా బలగాలు.

Samayam Telugu 8 Nov 2018, 2:49 pm
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. దంతేవాడ సమీపంలోని బచేలి దగ్గర బస్సుపై బాంబులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో నలుగురు చనిపోగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురు స్థానికులతో పాటూ మరో సీఐఎస్‌ఎఫ్ జవాన్ కూడా ఉన్నారు. ఘటన గురించి తెలియగానే భద్రతా బలగాలు స్పాట్‌కు చేరుకున్నాయి. మావోల కోసం కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి.
Samayam Telugu Mavos.


గత పది రోజుల్లో భద్రతా దళాలపై మావోలు దాడికి పాల్పడటం ఇది మూడోసారి. అక్టోబర్ 30న ఎన్నికల ఏర్పాట్లపై కవరేజ్ కోసం దంతేవాడ వెళ్లిన దూరదర్శన్ ఛానెల్ జర్నలిస్టులు, బలగాలపై నక్సల్స్ మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో ఓ జవాన్, జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయారు. గత నెల 27న ఛత్తీస్‌గఢ్‌లోని ఆవపల్లి వద్ద జరిగిన మరో దాడిలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరుగుతుండటంతో.. ప్రధాన పార్టీల నేతలంతా ప్రచారానికి తరలిరానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. వారి పర్యటనకు ముందే మావోయిస్టులు దాడికి పాల్పడి సవాల్ విసిరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.