యాప్నగరం

బిహార్ అవతల తాగినా ఉద్యోగం ఊడినట్టే!

రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేదాన్ని అమలు చేస్తున్న బిహార్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

Samayam Telugu 17 Feb 2017, 11:49 am
రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేదాన్ని అమలు చేస్తున్న బిహార్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అధికారులు, జడ్జీలు...బిహార్ సరిహద్దులు దాటి ప్రపంచంలో ఏ మూలన తాగినట్లు తేలినా... వారికి కఠిన చర్యలు తప్పవని నితీష్ కుమార్ ప్రభుత్వం చట్టం రూపొందించింది.
Samayam Telugu if bihar officials drink anywhere in the world will be punished
బిహార్ అవతల తాగినా ఉద్యోగం ఊడినట్టే!


ఈ మేరకు ప్రభుత్వం మద్యపాన నిషేద చట్టానికి సవరణలు చేసింది.

దీని ప్రకారం..ప్రభుత్వ ఉద్యోగులు, జడ్జీలు బిహార్ లో కాకుండా ఈ ప్రపంచంలో (విదేశాల్లో) ఎక్కడ మద్యం సేవించినట్లు ఆధారాలు లభించినా..ఉద్యోగం నుంచి తొలగించడం, సస్పెండ్ చేయడం లేదా వారి జీతాల్లో కోతలు విధించడం వంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు..బిహార్ కు చెందిన అధికారులు డిప్యూటేషన్ పై ఇతర ప్రాంత్రాలు, రాష్ట్రాలకు వెళ్లినా మద్యం సేవించరానది ఈ కొత్తం చట్టం చెబుతోంది.

సంపూర్ణ మద్య నిషేదంలో ప్రభుత్వ ఉద్యోగులకు భాగస్వాములుగా చేయడంతో పాటు రాష్ట్రం దాటక కూడా తాగకుండా కట్టడి చేసిన లిస్టులో బిహార్ దే ప్రథమ స్థానం.

అయితే బిహార్ దాటాక మద్యం సేవించే అధికారులను ఎలా గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటుందనే అంశంపై బిహార్ ప్రభుత్వం ఇంకా స్పష్టం ఇవ్వాల్సి ఉంది. అయితే అలాంటి అధికారులపై ఏమైనా ఫిర్యాదులు అందినప్పుడు మాత్రమే చర్యల సాధ్యమవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రంలో మద్యపాన నిషేదం అమల్లో ఉన్నా అధికారులు డ్రింకింగ్ లో మునిగి తేలుతున్నారని ఇటీవల కొంతమంది సీఎం నితీష్ దృష్టికి తీసుకురాగ..ప్రభుత్వం ఈ మేరకు చట్ట సవరణ చేసినట్లు సమాచారం.

గతయేడాది ఏప్రిల్ నుంచి బిహార్ లో సంపూర్ణ మద్య నిషేదం అమల్లో ఉంది. దీనిద్వారా నేరాలు తగ్గుతాయని, ప్రజల మధ్య సహృద్భావం సంబంధాలు ఏర్పడతాయని నితీష్ ప్రభుత్వం భావిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.