యాప్నగరం

జిన్నా ప్రధాని అయుంటే భారత్, పాక్ కలిసుండేవి: దలైలామా

బౌద్ధ మత గురువు దలైలామా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు తావిచ్చాయి. మహ్మద్‌ అలీ జిన్నాను ప్రధాన మంత్రి చేసి ఉంటే భారత దేశం ముక్కలయ్యేది ​కాదని ఆయన అన్నారు.

Samayam Telugu 8 Aug 2018, 10:19 pm
బౌద్ధ మత గురువు దలైలామా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు తావిచ్చాయి. మహ్మద్‌ అలీ జిన్నాను ప్రధాన మంత్రి చేసి ఉంటే భారత దేశం ముక్కలయ్యేది కాదని ఆయన అన్నారు. గోవా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో బుధవారం (ఆగస్టు 8) జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దలైలామా.. ఈ వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu lama


తప్పులు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? అని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. దలైలామా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘జాతిపిత మహాత్మా గాంధీ జిన్నాను ప్రధాని చేయాలని భావించారు కానీ, అందుకు నెహ్రూ అంగీకరించలేదు. తప్పులు జరుగుతూనే ఉంటాయి. నెహ్రూ చాలా అనుభజ్ఞుడు, కానీ, ఆయన కూడా తప్పులు చేశారు’ అని ఆయన వివరించారు.

‘నేను ప్రధాని కావాలనుకుంటున్నా’ అని నెహ్రూ మహాత్ముడితో అన్నట్లు దలైలామా చెప్పారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఎప్పుడో ఒకసారి తప్పు చేస్తారని, భారత మాజీ ప్రధాని జవహర్‌ లాల్‌ లాంటి గొప్ప వ్యక్తులు కూడా అందుకు అతీతం కాదని దలైలామా చెప్పుకొచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.