యాప్నగరం

అతడి జీతం ఏడాదికి రూ.1.5 కోట్లు

గత కొంత కాలంగా ఐఐటీలలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు తగ్గుముఖం పట్టాయని కానీ లేదా చెప్పుకోదగిన విధమైన ఉద్యోగ

TNN 4 Dec 2016, 6:05 am
గత కొంత కాలంగా ఐఐటీలలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు తగ్గుముఖం పట్టాయని కానీ లేదా చెప్పుకోదగిన విధమైన ఉద్యోగ అవకాశాలు ఇక్కడ రావడం లేదనే వాదనని కానీ కొట్టిపారేస్తూ ఓ భారీ ఆఫర్ ఐఐటీ కాన్పూర్ స్టూడెంట్‌ని వరించింది. ఢిల్లీకి చెందిన ఓ విద్యార్థికి మైక్రోసాఫ్ట్ సంస్థ రూ.1.5 కోటి వార్షిక వేతనం ఆఫర్ ఇస్తూ అతడిని రెడ్‌మండ్‌లో వున్న తమ కంపెనీ హెడ్ క్వార్టర్స్‌లో ఓ కీలక స్థానంలో నియమించింది. ఆ విద్యార్థి చేత ఓ సాఫ్ట్‌వేర్‌ని రూపొందించి, బగ్స్ సమస్యకి ఫుల్‌స్టాప్ పెట్టే విధంగా అతడిచేత పని చేయించుకునే ఆలోచనలో కంపెనీ వున్నట్టు తెలిసింది.
Samayam Telugu iit kanpur student gets a job offer of nearly rs 1 5 crore per annum from microsoft
అతడి జీతం ఏడాదికి రూ.1.5 కోట్లు


అతడి వేతనం వివరాల విషయానికొస్తే, 1,36,000 డాలర్లు (రూ.94 లక్షలు) బేస్ పే కాగా రిలొకేషన్‌తోపాటు మెడికల్, వీసా, స్టాక్ ఓనర్‌షిప్స్ వంటివి కలుపుకుని మరో 70,000 డాలర్లు అదనంగా కంపెనీకి అతడికి ఇవ్వనుంది. అన్నీ కలుపుకుని ఏడాదికి రూ.1.5 కోటి వరకు వార్షిక వేతనంగా అతడికి అందనుంది. గతేడాది ఐఐటీ-కాన్పూర్ విద్యార్థికి అందిన అత్యధిక వేతనం రూ. 93 లక్షలు మాత్రమే. గతేడాది క్యాంపస్ రిక్రూట్‌మెంట్ జాబితాలో వున్న కంపెనీల సంఖ్య 280 కాగా ఈసారి ఆ సంఖ్య 200కే పడిపోయింది. రిజర్వాయక్ క్యారక్టరైజేషన్, డ్రిల్లింగ్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్ రంగాలకి చెందిన సంస్థలు అసలు ఆ జాబితాలోనే లేకుండాపోయాయి. ఏదేమైనా మళ్లీ అత్యధిక వార్షిక వేతనం ఇచ్చే సంస్థల జాబితాలోకి మళ్లీ ఐటీ కంపెనీయే రావడం పట్ల వలువురు విద్యార్థులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.