యాప్నగరం

నేను ఏ తప్పు చేశానని జైల్లో ఉన్నా?: ఇళవరసి

అక్రమాస్తుల కేసులో శశికళతో పాటూ ఆమె వదిన ఇళవరసి కూడా జైలు శిక్ష అనుభవిస్తోంది.

TNN 25 May 2017, 3:42 pm
అక్రమాస్తుల కేసులో శశికళతో పాటూ ఆమె వదిన ఇళవరసి కూడా జైలు శిక్ష అనుభవిస్తోంది. తన దుస్థితిపై ఆమె చాలా ఆవేదన వ్యక్తం చేస్తోందని, తీవ్రంగా డిప్రెషన్ కు లోనవుతోందని తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తోంది. తనన చూడడానికి కొడుకు, బంధువులు వచ్చినప్పుడు ఆమె కన్నీరుమున్నీరైందట. అసలు తాను ఏం తప్పుచేశానని, ఈ శిక్ష వేశారని బాధపడిందట. ఇంట్లో వండి పెట్టడం తప్ప తనకేమీ తెలియదని చెప్పుకొచ్చిందట. పెట్టమన్న చోటల్లా సంతకాలు పెట్టడమే తప్పైపోయిందని బాగా రోదించిందట. బీపీ కూడా పెరిగిపోయి కళ్లు తిరిగిపడిపోవడంతో, అత్యవసరంగా చికిత్స అందించారల పోలీసులు. శశికళ మాత్రం చాలా ధైర్యంగానే ఉంటోందట. తనని కలవడానికి వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు చెప్పిన మాటలతో ఊరట చెందుతోందట. ఇళవరసి మాత్రం నిలువునా కుంగిపోతోందట. తాను జైలు నుంచి బయటికి శవమయ్యే వస్తానంటూ ఏడుస్తోందట.
Samayam Telugu ilavarasi meets son in parappana agrahara jail
నేను ఏ తప్పు చేశానని జైల్లో ఉన్నా?: ఇళవరసి


అక్రమాస్తుల కేసుల జయలలిత, శశికళ, ఇళవరసితో సహా సుధాకరన్ లు నిందితులుగా ఉన్నారు. జయలలిత మరణించడంతో ఆమెను పేరును తొలగించారు. సుప్రీంకోర్టు మిగతా ముగ్గురికీ నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది. వీరు అక్రమంగా కోట్ల ఆస్తిని సంపాదించారని తేల్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.