యాప్నగరం

monsoon: చల్లని కబురు.. మూడు రోజులు ముందే తాకిన నైరుతి రుతు పవనాలు

మూడు రోజులు ముందుగానే నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి. ప్రతి ఏడాది జూన్ ఒకటో తేదీన ప్రవేశించనున్న నైరుతి పవనాలు ఈసారి ఆదివారమే కేరళలోకి ప్రవేశించాయి. 15 రోజుల క్రితం బంగాళాఖాతంలో సంభవించిన అసని తుఫాన్ వల్ల రుతు పవనాల్లో వేగం పుంజుకుందని, అందుకే ముందుగానే వచ్చాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఈసారి వర్షాలు బాగా పడనున్నట్టు గతంలో వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీంతో ఈ ఏడాది వ్యవసాయం బాగా సాగనుందని ఆశాభావం వ్యక్తమవుతుంది.

Authored byAndaluri Veni | Samayam Telugu 29 May 2022, 3:26 pm
వేడితో సతమతమవుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మూడు రోజుల ముందే నైరుతి రుతు పవనాలు (monsoon) కేరళను తాకినట్టు వెల్లడించింది. సాధారణంగా జూన్ ఒకటో తేదీకి చేరుకుంటాయని కానీ ఈసారి ముందుగానే పలకరించినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మే 29 ఆదివారం నాడు కేరళలో ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ (IMD)డైరక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర చెప్పారు.
Samayam Telugu చల్లని కబురు.. మూడు రోజులు ముందే తాకిన నైరుతి రుతు పవనాలు


15 రోజుల క్రితం బంగాళాఖాతంలో సంభవించిన అసని తుఫాన్ వల్ల గత నెల నుంచి రుతు పవనాల్లో వేగం పెరిగిందని వాతావరణ నిపుణులు అన్నారు. ఆ ప్రభావంతోనే ఈసారి రుతు పవనాలు వేగంగా ప్రవేశించినట్టు అంచనా వేశారు. కాగా నైరుతి రుతు పవనాలు ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ గతంలో వెల్లడించింది. సాధారణం కంటే చాలా ముందుగానే అండమాన్ నికోబార్ దీవులను రుతు పవనాలు తాకాయని ఐఎండీ అధికారి మృత్యుంజయ్ చెప్పారు.

దీంతో రైతులకు కూడా శుభవార్త అందినట్టు అయింది. నిజానికి భారత దేశం ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ రంగంపైనే ఎక్కువ ఆధారపడి ఉంది. ఈ క్రమంలో రైతులకు నైరుతి రుతుపవనాలు ప్రధాన ఆధారంగా నిలుస్తాయి. ఇక్కడ రైతులు జూన్, జూలైలలో వరి, మొక్కజొన్న, చెరకు, పత్తి, సోయాబీన్ వంటి పంటలను వేస్తారు. వర్షాల వల్ల 70 శాతం నీటి సమకూరుతుంది. దాంతో వ్యవసాయం బాగా సాగి.. పంటలు బాగా పండుతాయి. గత నెలలో ఐఎండీ ఈ ఏడాది మంచి వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం జూన్‌లో ప్రారంభమయ్యే సీజన్‌లో సాధారణ వర్షపాతం 87 సెంటిమీటర్లు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.