యాప్నగరం

పన్నీరు సెల్వం: మనస్థాపంతో కన్నీరు

తమిళనాడు రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం పదవి నుండి తనను తొలిగించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మెరీనా బీచ్‌ లోని దివంగత నాయకురాలు జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు.

TNN 7 Feb 2017, 10:34 pm
తమిళనాడు రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం పదవి నుండి తనను తొలిగించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మెరీనా బీచ్‌ లోని దివంగత నాయకురాలు జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం కాసేపు జయ సమాధి వద్దే కూర్చుండిపోయారు. సుమారు 40 నిమిషాలు పాటు ఉద్విగ్నభరిత వాతావరణంలో ఉన్న పన్నీర్ సెల్వం మౌనదీక్షలో ఉండి అనంతరం కన్నీళ్లు పెట్టుకున్నారు.
Samayam Telugu in surprise visit o panneerselvam meditates at jayalalithaa memorial
పన్నీరు సెల్వం: మనస్థాపంతో కన్నీరు


పార్టీలో తనకు సరైన ప్రాధాన్యతను ఇవ్వడంలేదని తన సన్నిహితుల దగ్గర వాపోయిన పన్నీర్ సెల్వం ఉదయం నుండి పార్టీ నేతలకు అందుబాటులో లేరు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని అన్నాడీఎంకే నేతలు, శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. పన్నీర్ సెల్వం మద్ధతుదారులు అక్కడికి భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో ఏం జరుగుతుందోన్న ఉత్కంఠ నెలకొంది.

మౌనదీక్షఅనంతరం మీడియాతో మాట్లాడిన పన్నీర్ సెల్వం పార్టీని , ప్రజలను కాపాలని అమ్మ తనతో చెప్పారని, పార్టీ కేడర్ నన్ను సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారని, నివాళులు అర్పించడానికే అమ్మ సమాధి వద్దకు వచ్చానని, వాస్తవాలు చెప్పాలని అమ్మ ఆత్మ తనని ఆదేశించిందని , తాను చాలా క్రమశిక్షణతో పనిచేస్తున్నానని కొన్ని విషయాల్లో తనకు ఇష్టం లేకపోయినా .. క్రింద నుండి పైకి తీసుకువచ్చిన అమ్మ నిర్ణయం మేరకే తాను పనిచేస్తున్నాన్నారు. అమ్మ చెప్పారు కాబట్టే ముఖ్యమంత్రి పదవిని చేపట్టానని తమిళనాడు ప్రజలకు నిజాలు చెప్పడానికే వచ్చానని తనకు పదవీకాంక్షలేదని పన్నీర్ సెల్వం అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.