యాప్నగరం

విదేశాల్లోనూ పాపులరైన.. మన పోలింగ్ ‘సిరా చుక్క’!

ఇకమీదట జరిగే ఎన్నికల్లో సిరా సీసాల బదులు.. సిరా మార్కర్లను చూస్తామన్నమాట.

TNN 4 May 2017, 8:47 pm
విశాల భారతదేశంలో ఎప్పుడూ ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఎన్నికలు అనగానే ఈవీఎంలతో పాటు మనకు ఠక్కున గుర్తొచ్చే మరో అంశం.. సిరా చుక్క. సిరా మార్క్ చూపిస్తూ.. ‘నేను ఓటేశానోచ్..’ అని గర్వంగా చెప్పుకునేవారు ఎందరో ఉంటారు. ఇంతకీ పోలింగ్‌లో విరివిగా వాడే ఈ సిరా ఎక్కడ తయారవుతుందో తెలుసా.. కర్ణాటకలోని ‘మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ (మైలాక్)’ భారత ఎన్నికల సంఘం కోసం అనేక ఏళ్లుగా దీన్ని ఉత్పత్తి చేస్తోంది. దేశవ్యాప్తంగా ఈ ఇంక్‌ను సరఫరా చేసే సంస్థ ఇదొక్కటే కావడం విశేషం. అయితే ఇప్పుడు దీని విషయం ఎందుకంటారా? ఒక్క భారత్‌లోనే కాకుండా.. అనేక దేశాల్లో ఈ సంస్థ పట్ల మంచి విశ్వాసం ఉంది.
Samayam Telugu indelible ink from mysore for general elections of many nations
విదేశాల్లోనూ పాపులరైన.. మన పోలింగ్ ‘సిరా చుక్క’!


చాలా దేశాల్లో పోలింగ్ నిమిత్తం ఈ సంస్థ సిరా సీసాలను ఉత్పత్తి చేసి, పంపిణీ చేస్తోంది. తాజాగా కాంబోడియా పార్లమెంట్ ఎలక్షన్ల కోసం 46,500 సిరా బాటిళ్లను రూపొందించి, పంపించడానికి ఏర్పాట్లు చేసింది. ఒక్కో సీసాలో 70 మి.లీ. సిరా ఉంటుంది. ఈ మొత్తానికిగాను ఆ దేశంతో రూ. 5 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

మనదేశంలో ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల కోసం 4.3 లక్షల సిరా బాటిళ్లను రూపొందించింది మైలాక్. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల కోసం సిరా మార్కర్లను అందివ్వాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోరుతోందట. ‘సిరా సీసాల కంటే సిరా మార్కర్లను రూపొందించడమే చాలా సులభం. తద్వారా సమయం కూడా ఆదా అవుతుంది’ అని చెబుతున్నారు ఆ సంస్థ చైర్మన్ వెంకటేశ్. ఇకమీదట జరిగే ఎన్నికల్లో సిరా సీసాల బదులు.. సిరా మార్కర్లను చూస్తామన్నమాట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.