యాప్నగరం

మనాలీ నుంచి లేహ్ వరకు కొత్త రహదారి నిర్మాణం.. పాక్, చైనాలకు ఇక చుక్కలే!

సరిహద్దుల్లో నిరంతరం పాకిస్థాన్, చైనాల నుంచి ఎదురువుతున్న వివాదాలను, దాడులను సమర్ధంగా తిప్పికొట్టాలనే సంకల్పంతో భారత్ వ్యూహాత్మక రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

Samayam Telugu 20 Aug 2020, 8:00 am
లడఖ్‌ సరిహద్దుల్లో పాకిస్థాన్, చైనాలను మరింత సమర్ధంగా ఎదుర్కొని, అత్యవసర సమయంలో దళాలు, ట్యాంకులను తరలించడానికి మనాలి నుంచి లేహ్ వరకు కొత్త రహదారి నిర్మాణానికి భారత్ కృషి చేస్తోంది. గత మూడేళ్లుగా దౌలత్ బేగ్ ఓల్డి, ఇతర ప్రాంతాలతో సహా వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఉత్తర సబ్-సెక్టార్‌కు ప్రత్యామ్నాయాన్ని అనుసంధానం దిశగా కృషి చేస్తోన్న భారత్.. ప్రపంచంలోని ఎత్తైన రహదారి ఖార్డంగ్ లా పాస్ నుంచి ఇప్పటికే పనులు ప్రారంభించింది.
Samayam Telugu మనాలి నుంచి లేహ్‌కు కొత్త మార్గం


‘మనాలి నుంచి లేహ్ వరకు నిము-పాదం-దార్చా అక్షం నుంచి ప్రత్యామ్నాయ మార్గం కోసం ఏజెన్సీలు కృషి చేస్తున్నాయి.. ఇది శ్రీనగర్ నుంచి జోజిలా గుండా వెళుతున్న మార్గాలు.. మనాలి నుంచి లే వరకు సర్చు ద్వారా ఇతర మార్గాలతో పోల్చితే చాలా సమయం ఆదా అవుతుంది’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మనాలి నుంచి లేహ్‌కు ప్రయాణించేటప్పుడు దాదాపు మూడు, నాలుగు గంటల సమయం ఆదా అవుతుంది.. అలాగే పాకిస్థాన్ లేదా ఇతర శత్రువుల కదలికలపై భారత సైన్యం నిఘాకు ఎటువంటి ఉండదు.. సైన్యం, యుద్ధ ట్యాంకులు, ఫిరంగులు సహా భారీ ఆయుధాలను ఇతర ప్రదేశాల నుంచి లడఖ్‌కు తరలించడం సులభమవుతుంది అని వ్యాఖ్యానించాయి.

ద్రాస్-కార్గిల్ అక్షం గుండా వెళ్లే జోజిలా మార్గాన్ని వస్తువులు, ప్రజా రవాణాకు ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. ఇదే మార్గాన్ని 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ భారీగా లక్ష్యంగా చేసుకుంది. రహదారి పక్కన ఉన్న ఎత్తైన పర్వతాలలో ఉన్న స్థానాల నుంచి పాక్ దళాలు తరచూ దాడులకు పాల్పడ్డాయి అని అన్నారు. చైనాతో ఉద్రిక్తతలు నెలకున్న వేళ ఇటీవల ప్రధాని సరేంద్ర మోదీ లేహ్ పర్యటించినప్పటికే ఈ రహదారి నిర్మాణం ప్రారంభమైందని పేర్కొన్నాయి.

అదేవిధంగా, వ్యూహాత్మక దర్బుక్-ష్యోక్-దౌలత్ బేగ్ ఓల్డి రహదారికి ప్రత్యామ్నాయంగా వేసవిలో . పశ్చిమ వైపు నుంచి తూర్పు లడఖ్ ప్రాంతాలకు వెళ్లేందుకు ఉపయోగించే పాత మార్గాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోంది. కొత్త రహదారి లేహ్ నుంచి ఖార్దుంగ్లా వైపు ప్రయాణించి, ఆపై హిమానీనదాల ద్వారా ససోమా-సాసర్ లా-ష్యోక్, దౌలత్ బేగ్ ఓల్డి అక్షంతో ముగుస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.