యాప్నగరం

కుల్ భూషణ్ ఆచూకీ ఎక్కడ?: భారత్

గూఢచర్యానికి పాల్పడుతున్నాడంటూ పాకిస్థాన్ ఉరిశిక్ష విధించిన ఇండియన్ రిటైర్డ్ నేవీ ఆఫీసర్ కుల్ భూషణ్ జాదవ్

TNN 13 Apr 2017, 4:31 pm
గూఢచర్యానికి పాల్పడుతున్నాడంటూ పాకిస్థాన్ ఉరిశిక్ష విధించిన ఇండియన్ రిటైర్డ్ నేవీ ఆఫీసర్ కుల్ భూషణ్ జాదవ్ ఆచూకీపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్థాన్ మరణశిక్ష విధించినప్పటి నుంచి జాదవ్ ఆచూకీ తెలియడం లేదని, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో కూడా తమకు ఏలాంటి సమాచారం లేదని విదేశీ వ్యవహార శాఖ పేర్కొంది.
Samayam Telugu india doesnt know jadhavs location or how his health is mea says
కుల్ భూషణ్ ఆచూకీ ఎక్కడ?: భారత్


‘అతను (జాదవ్) ఎక్కడున్నాడో మాకు తెలియదు. అతని ఆరోగ్య పరిస్థితి ఏంటో మాకు ఏలాంటి సమాచారం లేదు’ అని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే ఆందోళన వ్యక్తం చేశారు.

జాదవ్ నేవీ నుంచి పదవి విరమణ పొందాక ఇరాక్ లో చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ ఉండేవారని.. అక్కడి నుంచే పాకిస్థాన్ మిలటరీ అతన్ని కిడ్నాప్ చేసిందని బాగ్లే ఆరోపించింది. ఇదే విషయంపై ఇరాక్ ను గతేడాది ప్రశ్నించినా ఏలాంటి స్పందన లేదని ఆయన గుర్తు చేశారు.

జాదవ్ తో మాట్లాడేందుకు ఏలాంటి కమ్యూనికేషన్ అందుబాటులో లేకపోవడంతో అతన్ని ముందస్తు ప్రకారంగా హత్య చేయాలని పాక్ ప్రభుత్వం వ్యూహ రచన చేస్తినట్లు తాము భావిస్తున్నామని బాగ్లే అన్నారు.

ఇలాంటి కేసుల్లో న్యాయ సలహా కోరే అవకాశం ఉంటుంది కానీ పాక్ అలాంటి పరిస్థితులు కల్పించడం లేదు. ఇప్పుడు జాదవ్ ఎలా ఉన్నాడో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అతడు పాకిస్థాన్ కు ఎలా వెళ్లాడో నిర్ధారించాలి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం అతన్ని కలిసే అవకాశం పాక్ కల్పించాలి’ అని బాగ్లే డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.