యాప్నగరం

‘డోక్లాం యుద్దం’లో భారత్‌దే విజయం!

మాతో పెట్టుకుంటే కొండను ఢీకొన్నట్లే, యుద్ధం వల్ల మీకే నష్టమంటూ చైనా ఎంతలా బెదిరింపులకు దిగుతున్నా.. భారత్ ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండానే డోక్లాంలో గెలుస్తోంది.

TNN 15 Aug 2017, 7:34 am
డోక్లాం ప్రాంతం విషయమై భారత్, చైనా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. దశాబ్దాల తర్వాత భారత సైన్యం చైనా ఆర్మీకి దీటుగా బదులిస్తోంది. చైనా పదే పదే బెదిరింపులకు దిగినా.. వెనుకడుగు వేయకుండా డ్రాగన్‌ను కట్టడి చేస్తోంది. మాతో యుద్ధం మీకే నష్టమంటూ చైనా బెదిరింపు స్వరంతో మాట్లాడినా.. భారత్ ఏమాత్రం చేతలతో తనేంటో చేసి చూపుతోంది. భారత్‌ను బెదిరించేందుకు సరిహద్దుల వెంబడి సైన్యాన్ని మోహరించి హడావుడి చేసిన చైనా తర్వాత వెనక్కి తగ్గింది. దక్షిణ చైనా సముద్ర పాంత దేశాలను బెదిరించినట్లుగానే భారత్‌తోనూ వ్యవహరించాలన్న చైనా వ్యూహం బెడిసికొట్టింది.
Samayam Telugu india is winning doklam war without firing a single bullet
‘డోక్లాం యుద్దం’లో భారత్‌దే విజయం!


ఒక్క చైనా దగ్గరే కాకుండా.. భారత అమ్ముల పొదిలోనూ అణ్వాయుధాలు ఉండటంతో.. మన సైన్యం ఎంత మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పటి వరకూ పాకిస్థాన్‌తోనూ వ్యవహరించనంత కఠినంగా ఇండియా తమ పట్ల దూకుడుగా వ్యహరించడం చూసి చైనా నివ్వెరపోయింది. వాస్తవానికి భారత్ ఇంతలా దూకుడు చూపుతుందని చైనా నాయకత్వం అంచనా వేయలేకపోయింది. అందుకే మాటల రూపంలో తన అసహనాన్ని వ్యక్తం చేస్తోంది.

డోక్లాం విషయంలో ఇండియా ఎంతటి పట్టుదలతో ఉందో అర్థమయ్యాక.. డ్రాగన్ కాస్త మెత్తబడుతోంది. మనతో పెట్టుకుంటే అతి పెద్ద మార్కెట్‌ను కోల్పోవాల్సి వస్తుందనే విషయం చైనాకు బాగా తెలుసు. మళ్లీ మనలాంటి మార్కెట్ దొరకడం ఆ దేశానికి అసాధ్యం. అందుకే యుద్ధానికి కౌంట్‌డౌన్ షురూ.. అంటూ రంకెలేసిన చైనాపై భారత్ ఒక్క బుల్లెట్ కూడా కాల్చకుండానే విజయం సాధించింది. కాకపోతే.. చైనాతో ఇంతకు మించి గొడవకు దిగితే.. మనకూ ఇబ్బందికరమే. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్‌లో సభ్యత్వం దక్కకుండా డ్రాగన్ మనకు మోకాలడ్డే అవకాశం ఉండనే ఉంది. ఏదేమైనా డోక్లాంలో భారత్‌ విజయం సాధిస్తోంది. చైనా బెదిరింపులను ఖాతరు చేయకుండా భారత్ సాధించిన గెలుపు ఇది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.