యాప్నగరం

మా విషయాల్లో వేలు పెట్టొద్దు.. కెనడా ప్రధానికి భారత్‌ హెచ్చరిక

Farmers Protest: ఢిల్లీ శివార్లలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను భాతర విదేశీ వ్యవహారాల శాఖ తీవ్రంగా పరిగణించింది.

Samayam Telugu 5 Dec 2020, 12:12 am
కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడోకు భారత్ హెచ్చరికలు పంపింది. భారత అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చొద్దని స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలు కొనసాగితే ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ శుక్రవారం (డిసెంబర్ 4) ఓ ప్రకటన విడుదల చేసింది.
Samayam Telugu జస్టిన్ ట్రూడో
Justin Trudo comments on PM Modi all party meeting


కేం‍ద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తోన్న సంగతి తెలిసిందే. రైతుల ఆందోళనకు మద్దతు ఇచ్చేలా కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ పార్లమెంట్‌ సభ్యుల్లో కొంత మంది కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. వీటిని భారత్‌ తప్పుబట్టింది. తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కెనడాకు తెలిపింది.

నవంబర్ 30న గురునానక్‌ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కెనడా ప్రధాని ట్రూడో భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనపై స్పందించారు. ‘శాంతియుతంగా నిరసనలు చేపట్టే హక్కులకు కెనడా ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుంది’ అని వ్యాఖ్యానించారు. రైతుల ఆందోళనపై స్పందించిన మొట్టమొదటి ప్రపంచనేతగా నిలిచారు.

కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలను భారత్ వెంటనే ఖండించింది. విదేశీ వ్యవహారాల శాఖ తాజాగా కెనడా ప్రధాని సహా ఆ దేశ మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలు ఎంత తీవ్రమైనవో కెనడా హైకమిషనర్‌ దృష్టికి తీసుకొచ్చింది. దీంతో పాటు కెనడాలోని భారత కమిషన్‌, కౌన్సిలేట్ల ముందు ఉగ్రవాద కార్యాకలాపాల సమావేశాలను ప్రోత్సహించడం శాంతి, భద్రతలకు ముప్పుగా మారుతుందని హెచ్చరించింది.

Also Read: 8న భారత్ బంద్.. రైతుల ఆందోళన ఉధృతం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.