యాప్నగరం

బోర్డర్‌ రోడ్డు నిర్మాణాలను వేగవంతం చేసిన భారత్

చైనాతో భవిష్యత్తులో డోక్లామ్ లాంటి సవాళ్లను ఎదుర్కొంటే, సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోడానికి సరిహద్దుల్లో రహదారి నిర్మాణాలను 2021లోపు పూర్తిచేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.

TNN 10 Sep 2017, 12:12 pm
చైనాతో భవిష్యత్తులో డోక్లామ్ లాంటి సవాళ్లను ఎదుర్కొంటే, సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోడానికి సరిహద్దుల్లో రహదారి నిర్మాణాలను 2021లోపు పూర్తిచేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. సరిహద్దుల్లో నిర్మించే 61 రహదారుల్లో రెండు లేదా మూడు మినహా మిగతావి బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌కు అప్పగించనుంది. ఈ సంస్థకు ఆర్థికపరమైన సమస్యలు లేకుండా చూస్తే వీటిలో చాలా వరకు నిర్దేశిత సమయం కంటే ముందుగానే పూర్తవుతాయి. ఇప్పటికే భారత్- చైనా సరిహద్దుల్లోని రోడ్డు నిర్మాణాల్లో గత రెండు మూడేళ్ల నుంచి గణనీయమైన పురోగతి ఉంది. 2014-15 ఏడాదిలో 107 కిలోమీటర్లుగా ఉన్న ఇవి 2016-17కు 147 కిలోమీటర్లకు చేరుకున్నారు.
Samayam Telugu india speeds up border road work to avoid future doklams
బోర్డర్‌ రోడ్డు నిర్మాణాలను వేగవంతం చేసిన భారత్


అలాగే పర్వతాలు, కొండలు లాంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఉపరితలంలో రహదారుల విస్తీర్ణం 173 నుంచి 233 కిలోమీటర్లకు చేరుకుంది. వాతావరణ పరిస్థితుల కారణంగా కేవలం నాలుగు నుంచి ఆరు మాసాల మాత్రమే నిర్మాణాలకు అనుకూలంగా ఉంటుంది. చైనాతో సరిహద్దుల్లోని 3,400 కిలోమీటర్ల విస్తీర్ణం గల 61 రహదారుల్లో కేవలం 270 కి.మీ. తప్ప మిగతావి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌కు అప్పగిస్తారు. సాంకేతిక పరిజ్ఞానం, కార్యనిర్వాహక పనుల కోసం బీఆర్ఓకు ఏడాదికి రూ.100 కోట్ల మంజూరు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. సరిహద్దుల్లో భారత, చైనా సైన్యాల మధ్య ఉన్న రవాణా అంతరాలను తగ్గించడానికి కేంద్ర వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

దీనిలో భాగంగానే డోక్లాం లాంటి ఘటనలు పునరావృతమైతే వాటిని సమర్థంగా తిప్పికొట్టడానికి రోడ్లను త్వరగా పూర్తిచేయాలని భావిస్తోంది. అలాగే ప్రభుత్వం భయాందళనలకు గురైన మరో అంశం కూడా ఉంది... ఉపాధి కోసం చైనాకు తరలిపోయే వారి వలసలను నివారించి, తద్వారా చైనా దళాలకు కూడా స్థానికుల నుంచి సహాయాన్ని తగ్గించాలని చూస్తోంది. మరోవైపు సరిహద్దుల్లో రోడ్డు నిర్మాణాలపై కాగ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవలం 27 రోడ్లు మాత్రమై పూర్తయినట్లు తన నివేదికలో కాగ్ పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.