యాప్నగరం

కాలుష్యం కోరల్లో భారతావని.. విస్మయం గొలిపే వాస్తవాలు

కాలుష్య భూతం భారత్‌ను వణికిస్తోంది. ప్రపంచంలో ఏ దేశాల్లో లేనంతగా.. భారతీయులు కాలుష్యానికి బలవుతున్నారు.

TNN 20 Oct 2017, 11:28 am
కాలుష్య భూతం ప్రపంచాన్ని వణికిస్తోంది. 2015లో కాలుష్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 90 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిడ్స్, టీబీ, మలేరియా వ్యాధులతో మరణిస్తున్న వారి కంటే కాలుష్యం వల్ల చనిపోతున్న వారి సంఖ్య అధికంగా ఉండటం ఆందోళనకరం. భారత్ విషయానికి వస్తే.. ప్రపంచంలో మరే దేశంలో లేనంతగా కాలుష్యం భారతీయుల్ని పొట్టన బెట్టుకుంటోంది. 2015లో భారత్‌లో 25 లక్షల మంది మరణించడానికి కాలుష్యమే ప్రధాన కారణం. 18 లక్షల మరణాలతో చైనా రెండో స్థానంలో ఉంది. ఈ విషయాలను లాన్సెట్ కమిషన్ ఆన్ పొల్యూషన్ అండ్ హెల్త్ వెల్లడించింది.
Samayam Telugu india tops global pollution deaths of 9 million a year scientific study
కాలుష్యం కోరల్లో భారతావని.. విస్మయం గొలిపే వాస్తవాలు


ప్రతి ఆరుగురిలో ఒకరు చనిపోవడానికి కాలుష్యమే ప్రధాన కారణం. ముఖ్యంగా అభివృద్ధి చెందుతోన్న దేశాలపై కాలుష్యం ప్రభావం ఎక్కువగా ఉంటోందని లాన్సెట్ నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచీకరణ, గనుల తవ్వకం, ఉత్పత్తి రంగాలు పేద దేశాలకు తరలడం, పర్యావరణ నిబంధనల్ని ఉల్లంఘించడం దీనికి కారణమని ప్యూర్ ఎర్త్ అనే పర్యావరణ సంస్థలో సలహాదారైన కార్తీ శాండిల్య తెలిపారు.


‘దీర్ఘకాలంపాటు కాలుష్యం ప్రభావానికి గురవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మందగిస్తుంది. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కోట్లాది మంది ఇప్పటికీ కట్టెల పొయ్యి, బొగ్గు పొయ్యిల మీదే వంట చేస్తున్నారు. ఇది మహిళలకు, పిల్లలకు హానికరం. పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతుండటం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంద’ని ప్యూర్ హెల్త్ తెలిపింది.


ప్రపంచంలోని పేద దేశాల ప్రజలపై కాలుష్య ప్రభావం అధికంగా ఉంటోంది. ఉదాహరణకు ఢిల్లీనే తీసుకుంటే.. ఇక్కడ భవన నిర్మాణ రంగంలో పని చేసే కార్మికులకు కాలుష్యం ముప్పు ఎక్కువ. వారు పని చేసే ప్రదేశాలతోపాటు, ప్రయాణించే రోడ్లపై కూడా కాలుష్యం తీవ్రంగా ఉంటోంది. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా మంది ఏసీ వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. ఏసీ ఆఫీసుల్లో పని చేస్తున్నారని కార్తీ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.