యాప్నగరం

Indian Air Force Day: ఘనంగా వైమానిక దళ వార్షికోత్సవ వేడుకలు.. కేరళ సర్కారు ట్వీట్ అదుర్స్!

భారత గగనతలాన్ని కంటికి రెప్పలా కాాపాడుతన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 86వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ఈ వేడుకల సందర్భంగా కేరళ సర్కారు.. ఎయిర్‌ఫోర్స్‌కు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేసింది.

Samayam Telugu 8 Oct 2018, 11:41 am
యుద్ధ సమయాల్లో తక్షణమే రంగంలోకి దిగి దేశాన్ని కాపాడే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 86వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. భారత గగనతలాన్ని కంటికి రెప్పలా కాపలా కాస్తోన్న వైమానిక దళాన్ని 1932 అక్టోబర్ 8న అధికారికంగా ఏర్పాటు చేశారు. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో సిబ్బంది పరేడ్ నిర్వహిస్తున్నారు.
Samayam Telugu airforce day


పరేడ్ ముగిసిన అనంతరం వైమానిక దళ సిబ్బంది విన్యాసాలు చేపడతారు. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన జాగ్వర్, మిగ్-29, మీరజ్-2000, సుఖోయ్, యుద్ధ విమానాలతోపాటు రుద్ర హెలికాప్టర్ల ద్వారా ఈ విన్యాసాలు చేపడతారు. ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఆయుధాలు, రాడార్, క్షిపణి వ్యవస్థలను వీక్షించేందుకు సాధారణ ప్రజలకు అవకాశం కల్పిస్తారు.
ఎయిర్‌ఫోర్స్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత వైమానిక దళానికి శుభాకాంక్షలు తెలిపారు. వైమానిక వీరులు, వారి కుటుంబ సభ్యులకు దేశం యావత్తూ సెల్యూట్ చేస్తోందని మోదీ ట్వీట్ చేశారు. గగన తలాన్ని రక్షించడంలో, విపత్తుల సమయంలో మానవత్వంతో బాధితులను కాపాడటంలో ఎయిర్‌ఫోర్స్ ముందుండి పని చేస్తోందని మోదీ అభినందించారు.
మీ సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి కేరళ ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపింది. ఇటీవల కేరళను వరదలు ముంచెత్తినప్పుడు.. ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో విశేష కృషి చేసింది.

ఎయిర్‌ఫోర్స్ వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం 500 మంది ఎయిర్ వారియర్లతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 8 కి.మీ. క్రాస్ కంట్రీ రన్ నిర్వహించింది. జమ్మూలో 100 మంది చిన్నారులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

గత వారం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అదంపూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ఆధునీకరించిన మిగ్-29 యుద్ధ విమానాలను ప్రదర్శించింది. సరికొత్త మిగ్-29 యుద్ధ విమానాలు 5 నిమిషాల్లోగా టేకాఫ్ తీసుకోగలవు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.