యాప్నగరం

IAF అమ్ములపొదిలో సరికొత్త అస్త్రాలు.. ఇక శత్రువులకు వణుకే!

Indian Air Force మరింత శక్తిమంతమైంది. ఎయిర్ ఫోర్స్ అమ్ములపొదిలో సరికొత్త అస్త్రాలు చేరాయి. ‘గగనతలాన్ని మేమే ఏలుతున్నాం..’ అంటూ ఐఏఎఫ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Samayam Telugu 18 Jan 2020, 10:57 pm
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) మరింత శక్తిమంతమైంది. ఐఏఎఫ్ అమ్ములపొదిలో సరికొత్త అస్త్రాలు కొలువుదీరాయి. భార‌త వైమానిక ద‌ళం వద్ద ఉన్న సుఖోయ్ విమానాలు అత్యాధునిక హంగులతో రూపాంత‌రం చెందాయి. ఈ యుద్ధ విమానాలను మ‌రింత ఆధునీక‌రించారు. ఇకపై ఈ విమానాలు బ్రహ్మోస్ సూప‌ర్‌సోనిక్ క్షిప‌ణుల‌ను కూడా ప్రయోగించనున్నాయి.
Samayam Telugu iaf


ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అత్యాధునిక హంగులు సొంతం చేసుకున్న నేపథ్యంలో ఓ ఆస‌క్తిక‌ర‌ ట్వీట్ చేసింది. ‘గ‌గ‌న‌త‌లాన్ని మేమే ఏలుతున్నాం..’ అంటూ ఆ ట్వీట్‌లో ఐఏఎఫ్ పేర్కొంది. సుఖోయ్‌ - 30MKI యుద్ధ విమానంలో విహ‌రిస్తున్న పైలట్ల ఫోటోను జతచేసింది. ట్వీట్ చేసిన కొన్ని గంట‌ల్లోనే అది వైర‌ల్‌గా మారింది.

సుఖోయ్-30ఎంకేఐ, మికోయాన్ గురేవిచ్ మిగ్‌-29, మిరాజ్‌-2000, జాగ్వార్‌, ఇండీజీనస్ తేజ‌స్ లైట్ క్యాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో భార‌త వైమానిక ద‌ళం ప‌టిష్టమైంది. శత్రు దేశాల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.

ఐఏఎఫ్ వద్ద సుమారు 250 సుఖోయ్‌లు ఉన్నాయి. వీటిలో 42 సుఖోయ్‌ల‌ను బ్రహ్మోస్ క్షిప‌ణుల‌కు త‌గిన‌ట్లుగా మార్చేందుకు ఐఏఎఫ్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన శాంపిల్ విడుదల చేసింది. ఆ యుద్ధ విమానాలన్నీ రూపాంతరం చెందితే.. ఇక ఐఏఎఫ్ మ‌రింత శత్రుదుర్భేద్యంగా మారుతుంది.

Don't Miss: పంచాయతీ ఎన్నికల్ పాక్ మహిళ పోటీ.. సర్పంచ్‌గా ఎన్నిక

గతేడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్‌లోని బాలాకోట్‌పై జరిపిన దాడుల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు కీలక పాత్ర పోషించాయి. భారత గగనతలం వైపు దూసుకొచ్చిన పాకిస్థాన్ యుద్ధ విమానాలను తరిమికొట్టడంలో అదే దర్పం ప్రదర్శించాయి. తద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. నాటి నుంచి ఐఏఎఫ్ పేరు మార్మోగిపోతోంది. అటు వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటంలోనూ, ఆహారం పంపిణీ చేయడంలో ఐఏఎఫ్ సిబ్బంది అనితరసాధ్యమైన సేవలు చేస్తూ భారతీయుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

Also Read: బీజేపీ పేరు చెబితే నా బామ్మర్దులు తెగ భయపడుతున్నారు: రాజాసింగ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.