యాప్నగరం

నాసా వ్యోమగాముల్లో భారత సంతతి వ్యక్తి

నాసా త్వరలో చేపట్టనున్న అంతరిక్ష ప్రయోగానికి ఎంపికైన వ్యోమగాముల జాబితాలో భారత్‌ సంతతికి చెందిన వ్యక్తి ..

TNN 9 Jun 2017, 7:04 pm
నాసా త్వరలో చేపట్టనున్న అంతరిక్ష ప్రయోగానికి ఎంపికైన వ్యోమగాముల జాబితాలో భారత సంతతికి చెందిన వ్యక్తి చోటు దక్కించుకున్నారు. యూఎస్‌ ఎయిర్‌‌ఫోర్స్‌లో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా పనిచేస్తున్న రాజాచారి (39)కి ఈ అవకాశం లభించింది. ఎర్త్‌ ఆర్బిట్‌ అండ్‌ డీప్‌ స్పేస్‌ మిషన్ ప్రయోగం కోసం నాసా గతంలో దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీని కోసం రికార్డు స్థాయిలో 18,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరి నుంచి నాసా 12 మందిని ఎంపిక చేసింది.
Samayam Telugu indian american raja chari among 12 nasa astronauts
నాసా వ్యోమగాముల్లో భారత సంతతి వ్యక్తి


అమెరికాలో అయోవా రాష్ట్రంలోని వాటర్‌లూ నగరంలో నివసిస్తున్న రాజాచారి మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఏరోనాటిక్స్‌ అండ్‌ ఆస్ట్రోనాటిక్స్‌లో మాస్టర్‌ డిగ్రీ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన 461 ఫ్లైట్‌ టెస్ట్‌ స్క్వాడ్రన్‌లో కమాండర్‌గా, కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లో ఉన్న ఎఫ్‌–35 ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ ఫోర్స్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.