యాప్నగరం

భారత్‌కు అమెరికా శతఘ్నులు

30ఏళ్ల తర్వాత అమెరికా నుంచి భారత సైన్యంలోకి శతఘ్నులు చేరాయి. భారత ఆర్మీ వీటిని కొనుగోలు చేసింది.

Samayam Telugu 18 May 2017, 5:16 pm
30ఏళ్ల తర్వాత అమెరికా నుంచి భారత సైన్యంలోకి శతఘ్నులు చేరాయి. భారత ఆర్మీ వీటిని కొనుగోలు చేసింది. రెండు ఎం-777 ఆల్ట్రా-లైట్‌ హొవిట్జర్‌ (ఫిరంగులు) ఆయుధాలు గురువారం భారత్‌కు చేరుకున్నాయి. 1980లలో స్వీడన్‌ నుంచి బొఫోర్స్‌ తుపాకులను(శతఘ్నులు) చివరిసారిగా ఇండియా కొనుగోలు చేసింది. ఆ తర్వాత నుంచి ఇటువంటి ఆయుధాలను మళ్లీ కొనుగోలు చేయడం ఇదే.
Samayam Telugu indian army gets first artillery guns from us after 3 decades
భారత్‌కు అమెరికా శతఘ్నులు


సైన్యం ఆయుధ సంపత్తిని వృద్ధి చేసుకునేందుకు శతఘ్నులు కొనుగోలు చేయాలని గతేడాది కేంద్రం నిర్ణయించింది. ఈ శతఘ్నులను700మిలియన్‌ డాలర్లతో కొనుగోలు చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ఒప్పందం కింద మొత్తం 145 శతఘ్నులను భారత సైన్యం కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. ఇందులో 25 ఆయుధాలను బీఏఈ సిస్టమక్స్ (గన్ తయారీ కంపెనీ) డెలివరీ చేస్తుండగా.. మిగిలిన 120 శతఘ్నులను మహింద్రా కంపెనీ సాయంతో భారత్‌లోనే తయారు కానున్నాయి. వీటిలో రెండు గురువారం ఆర్మీకి చేరాయి. 153ఎంఎం/39 కాలిబర్‌ సామర్థ్యంతో ఉన్న ఈ ఆయుధాలను (ఫిరంగులు) సరిహద్దుల్లోని ఎత్తైన ప్రదేశాల్లో ఉపయోగిస్తారు. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని చేరుకునే సామార్థ్యం వీటి సొంతం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.