యాప్నగరం

ఆస్ట్రేలియాలో భారతీయ మతగురువుపై దాడి

మెల్‌బోర్న్‌లో భారత సంతతికి చెందిన క్రైస్తవ మతగురువు.. టామీ కలథూర్‌ మాథ్యూ(48)పై ఒక వ్యక్తి దాడి చేసి గొంతులో పొడిచాడు.

TNN 20 Mar 2017, 1:42 pm
అమెరికాలో.. భారతీయులపై జరిగిన జాత్యంహంకార దాడి ఘటనలు మరవకముందే.. ఆస్ట్రేలియాలోనూ అదే తరహా దాడి జరగడం కలవరానికి గురిచేస్తోంది. మెల్‌బోర్న్‌లో భారత సంతతికి చెందిన క్రైస్తవ మతగురువు.. టామీ కలథూర్‌ మాథ్యూ(48)పై ఒక వ్యక్తి దాడి చేసి గొంతులో పొడిచాడు. మెల్‌బోర్న్‌ శివారు ప్రాంతంలోని సెయింట్‌ మాథ్యూస్‌ చర్చిలో ఆదివారం (మార్చి 19) ఆయన ప్రార్థనలు చేయిస్తుండగా ఈ ఘటన జరిగింది. మాథ్యూ కేరళలోని కోజికోడ్‌ జిల్లాకు చెందినవారు.
Samayam Telugu indian priest stabbed inside melbourne church
ఆస్ట్రేలియాలో భారతీయ మతగురువుపై దాడి


దాడి చేసిన వ్యక్తి.. ‘నువ్వు భారతీయుడివి. నువ్వు ప్రార్థన చేయించడానికి వీల్లేదు. నిన్ను చంపేస్తా’ అని అరుస్తూ.. మాథ్యూ దగ్గరికి వచ్చి కత్తితో పొడిచాడు. ప్రార్థన చేయడానికి వచ్చిన కొంత మంది అతడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అతడు తప్పించుకున్నాడు. ప్రార్థన సమయంలో ప్రత్యేక దుస్తులు ధరించి ఉండటం వల్ల.. కత్తి గొంతు లోపలికి దిగకపోవడంతో మాథ్యూకు ప్రమాదం తప్పింది. ఆయన హాస్పిటల్‌లో చికిత్స తీసుకొని వెంటనే డిచ్చార్జ్ అయ్యారు. ‘దేవుడి దయ వల్లే నేను ప్రాణాలతో బయటపడ్డాను’ అని ఆయన వ్యాఖ్యానించారు. పోలీసులు.. దాడి చేసిన వ్యక్తిని ఆదివారం రాత్రి అరెస్ట్‌ చేశారు. అతడు ఇటాలియన్‌ సంతతికి చెందినవాడిగా అనుమానిస్తున్నారు. అతడికి 72 ఏళ్లు ఉంటాయని భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.