యాప్నగరం

విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల కోసం...

విదేశాల్లో చదువుతున్న భారత విద్యార్థుల కోసం ప్రత్యేక డాటాబేస్ ను ఏర్పాటు చేయనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మస్వరాజ్ తెలిపారు.

TNN 11 Sep 2016, 2:46 pm
విదేశాల్లో చదువుతున్న భారత విద్యార్థుల కోసం ప్రత్యేక డాటాబేస్ ను ఏర్పాటు చేయనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మస్వరాజ్ తెలిపారు. ఇండియా నుంచి విదేశాల్లో ఎక్కడ చదివినా http://www.madad.gov.in తమ పేర్లు విధిగా నమోదు చేసుకోవాలని ఆమె విద్యార్థులకు సూచించారు. తమ వద్ద పేర్లు, కోర్సుల వివరాలు, చదువుతున్న యూనివర్సిటీ, సంబంధిత వివరాలుంటే ఏదైనా సమస్యలు తలెత్తినప్పుడు సాయం అందించడానికి ఆయా దేశాల్లో ఉండే భారత రాయబార కార్యాలయాలు సిద్ధంగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు. రాయబార కార్యాలయాలు ఇండియన్ విద్యార్థులకు కుటుంబంలా సాయం అందిస్తాయని ఆమె భరోసా ఇచ్చారు. బోగస్ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొంది మోసపోరాదని సుష్మ విద్యార్థులకు సూచించారు.
Samayam Telugu indian students must register their name on database
విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల కోసం...


We have no data of Indian students studying abroad. We have therefore, started a Students Registration Module on https://t.co/h8IZFvYsRx— Sushma Swaraj (@SushmaSwaraj) September 8, 2016

I request all Indian students to register themselves on this module.This will be of immense help. /2— Sushma Swaraj (@SushmaSwaraj) September 8, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.