యాప్నగరం

మన కంటే పాకిస్థానీలే సంతోషంగా ఉన్నారట!

నిరంతరం ఉగ్రవాద చర్యలతో సతమతమయ్యే పాకిస్థాన్ ప్రజలు మాత్రం వ్యక్తిగత జీవితంలో భారతీయుల కంటే చాలా సంతోషంగా ఉన్నారు. ఈ మాటలను సాక్షాత్తు ఐరాస నివేదికే చెప్పింది .

TNN 15 Mar 2018, 10:54 am
ప్రపంచంలో సంతోషకరమైన దేశాల జాబితాలో భారత్ మరింత కిందికి పడిపోయింది. గతేడాది నాలుగు స్థానాలు దిగజారిన ఇండియా, ఈ ఏడాది మరో 11 స్థానాలను కోల్పోయి 156 దేశాల జాబితాలో 133 వ స్థానంలో నిలిచింది. ఈ విషయంలో దాయాది పాకిస్థాన్ మాత్రం మన కంటే మెరుగైన స్థానంలో ఉండటం విశేషం. ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ప్రపంచంలోని సంతోషకరమైన దేశాల జాబితా 2018లో మనం 133 వ స్థానంలో ఉంటే, పాక్ 75 వ ర్యాంకు దక్కించుకోవడం గమనార్హం. 2017 జాబితాలోనూ పాక్ మన కంటే మెరుగ్గానే ఉంది. అంతేకాదు ఈ ఏడాది మరింత పైకి ఎగబాకింది. కేవలం పాకిస్థాన్ వాసులే కాదు పొరుగున ఉన్న మిగతా దేశాల్లోని ప్రజలు కూడా మన కంటే చాలా సంతోషంగా ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా అంత మాత్రంగానే ఉన్న వీరంతా భారతీయుల కంటే ఆనందంగా ఉన్నట్టు నివేదిక స్పష్టం చేసింది.
Samayam Telugu indians are an unhappy lot but pakistanis get more joyful un report
మన కంటే పాకిస్థానీలే సంతోషంగా ఉన్నారట!


బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంకలతోపాటు నియంతృత్వ‌ పాలన సాగుతోన్న చైనాలోనూ ప్రజలు సంతోషంగా గడుపుతున్నారు. ఐరాస వెల్లడించిన ప్రపంచంలోని సంతోషకరమైన దేశాల జాబితా 2018లో ఫిన్‌లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. జీవన ప్రమాణాలు, సామాజిక మద్దతు, అవినీతి, సంతోషం స్థాయిలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించి, ర్యాంకులను కేటాయించారు. స్వల్పస్థాయి సూర్యరశ్మి, శీతల వాతావరణం ఉన్నా ఫిన్‌లాండ్ వాసులు చాలా సంతోషంగా ఉన్నారని నివేదిక పేర్కొంది. ఆర్థికంగా, రాజకీయంగా దేశంలోని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, వ్యవస్థలో పునాదులు బలంగా ఉన్నట్టు భావిస్తున్నాం.. కాబట్టి పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్లే తాము సంతోషంగా ఉన్నామని ఫిన్‌లాండ్‌ రాజధాని హెల్సింకికి చెందిన సోఫియా హోల్మ్ అనే యువతి వ్యాఖ్యానించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.