యాప్నగరం

కరోనా వ్యాక్సిన్: యూకే ఫ్లైట్ల కోసం ఆరా తీస్తున్న భారతీయులు

Pfizer Biontech Covid Vaccine: బ్రిటన్‌లో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్ధం చేశారనే వార్త తెలియగానే.. భారతీయులు అక్కడకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకునే అవకాశాల కోసం ఎంక్వైరీ చేస్తున్నారు.

Samayam Telugu 4 Dec 2020, 12:18 am
రోనా వ్యాక్సిన్ పంపిణీకి బ్రిటన్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఫైజర్‌-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్‌కు బ్రిటన్‌ ప్రభుత్వం బుధవారం (డిసెంబర్ 2) ఎమర్జెన్సీ వినియోగం కింద అనుమతి మంజూరు చేసింది. దీంతో ఆ దేశంలో వచ్చే వారమే ప్రజలకు టీకాలు వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ కోసం బ్రిటన్ వాసులతో పాటు ఇతర దేశాల వారు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. భారతీయుల కూడా ఈ వ్యాక్సిన్‌ను అందిపుచ్చుకునే అవకాశాలపై కన్నేశారు.
Samayam Telugu కరోనా వ్యాక్సిన్
UK Corona Vaccine


Pfizer Biontech Vaccine కోసం బ్రిటన్‌ వెళ్లేందుకు చాలా మంది భారతీయులు ప్రయత్నిస్తున్నట్లు ఇక్కడి ట్రావెల్‌ ఏజెన్సీ‌ సంస్థల ద్వారా తెలుస్తోంది. బ్రిటన్‌లో కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వబోతున్నారనే వార్త వచ్చిన వెంటనే యూకే ప్రయాణాలపై భారతీయుల నుంచి ఎంక్వైరీలు పెరిగాయని ఆ సంస్థల ప్రతినిధులు తెలిపారు.

వ్యాక్సిన్‌ పొందేందుకు యూకేకు ఎప్పుడు? ఎలా వెళ్లవచ్చని బుధవారం సాయంత్రం తమను చాలా మంది ఆరా తీశారని ముంబైకి చెందిన EaseMyTrip.com ట్రావెల్ ఏజెన్సీ కోఫౌండర్‌, సీఈవో నిషాంత్ పిట్టి తెలిపారు. వ్యాక్సిన్ గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేమ‌ని, తొలుత అత్యవసరం ఉన్నవారికే వ్యాక్సిన్ వేస్తార‌ని తాము వాళ్లకు చెప్పిన‌ట్లు ఆయన తెలిపారు.

వాస్తవానికి ఈ స‌మ‌యంలో లండ‌న్‌కు వెళ్లే భారతీయుల సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉంటుంద‌ని, అయితే.. ఈ వ్యాక్సిన్ వార్తతో యూకే టూర్‌కు ఒక్కసారిగా ఫుల్ డిమాండ్ ఏర్పడిందని నిషాంత్ చెప్పారు. ఈ నేపథ్యంలో తాము కూడా కేవ‌లం వ్యాక్సినేష‌న్ కోసం వెళ్లే వారి కోసం 3 రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి బోరిస్ జాన్సన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలి ప్రాధాన్యం కింద వృద్ధులు, ఆరోగ్య సిబ్బందికి టీకా ఇవ్వనున్నారు. విదేశీయులకు టీకా ఇస్తారా? ఒకవేళ ఇస్తే.. ఎప్పటి నుంచి ఇస్తారు? అనే అంశాలపై స్పష్టత లేదు. విదేశీయులకు వ్యాక్సిన్ ఇచ్చే అంశంపై యూకే ప్రభుత్వం స్పష్టత ఇస్తే.. ప్రయాణికుల కోసం తాము ప్రత్యేక ప్యాకేజీలు కల్పిస్తామని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి.

Also Read: గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా యూకే ప్రధాని

Must Read: వంట గ్యాస్‌ ధర భారీగా పెంపు.. సామాన్యులకు షాక్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.