యాప్నగరం

Coronavirus భారత్‌లో రెండో కేసు.. చైనాలో 304కి చేరిన మృతులు

wuhan నగరంలో బయటపడిన కరోనా వైరస్ క్రమంగా అన్ని దేశాలకూ విస్తరిస్తోంది. ప్రస్తుతం 20 దేశాలకు వ్యాప్తిచెందిన కరోనా వైరస్.. చైనాలో మరింత తీవ్రరూపం దాల్చింది.

Samayam Telugu 2 Feb 2020, 11:53 am
ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ వ్యాపిస్తోంది. తాజాగా వైరస్‌కు సంబంధించి రెండో కేసు నమోదైంది. ప్రస్తుతం అతడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందజేస్తున్నామని, అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్‌ సోకిన బాధితుడు ఇటీవల చైనాలో పర్యటించినట్లు గుర్తించారు. మూడు రోజుల క్రితం కేరళలోనే తొలి కరోనా కేసు నమోదైన విషయం తెలిసిందే. కేరళకు చెందిన ఈ విద్యార్ధిని చైనాలోని వుహాన్‌ నగరంలో విద్యాభ్యాసం చేస్తోంది. వైరస్‌ తీవ్రతకు భయపడి ఆ విద్యార్ధిని స్వస్థలానికి చేరుకోగా, ఆమె రక్త నమూనాలను సేకరించి పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పరీక్షించారు.
Samayam Telugu kerala.


Read Also: వుహాన్ నుంచి భారత్‌ చేరిన రెండో బృందం.. చిత్తూరులో కరోనా కలకలం

ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా సోకిన విషయం బయటపడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తాజా కేసుతో ఇప్పటి వరకు భారత్‌లో ఇద్దరు ఈ వైరస్ బారిన పడ్డట్లు ధ్రువీకరించారు. మరోవైపు, చైనాలో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. ఈ వైరస్ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 304కు చేరుకోగా, 14వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లోనే 45 మంది చనిపోగా, కొత్తగా మరో 2,590 మంది కరోనా బారినపడినట్టు చైనా ఆరోగ్య కమిషన్ వెల్లడించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. మొత్తం 14,380 కరోనా వైరస్ కేసులు నమోదుకావడంతో 2003లో సార్స్ వైరస్ సోకినవారి కంటే ఇది అధికం. హుబే ప్రావిన్సుల్లోని హౌవున్‌గాగ్‌లో కరోనా వైరస్‌ను నియంత్రించే చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయని చైనా అధికార పత్రికే పెదవి విరించింది. రోగులకు అవసరమైన ఔషధాలు, మెడికల్ మాస్క్‌లు అందుబాటులో లేవని ఆ నగర మేయర్ ప్రకటించారు.

Read Also: తిరుపతిలో నలుగురికి కరోనా లక్షణాలు.. ‘రుయా’ నిర్లక్ష్యం, సర్కారు సీరియస్!

స్వదేశంలో ప్రజా రవాణను నిలిపివేసి, ప్రయాణాలపై ఆంక్షలు విధించినప్పటికీ, గత రెండు వారాల్లో చైనాను సందర్శించిన చాలా మంది విదేశీయులను తమ దేశంలోకి ప్రవేశించకుండా అమెరికా నిషేధం విధించింది. ఈ విషయంలో ఆస్ట్రేలియా, జపాన్, సింగ్‌పూర్ సైతం అమెరికానే అనుసరిస్తున్నట్టు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో చైనా మరింత అప్రమత్తమైంది. భారత్, దక్షిణ కొరియాలు తమ పౌరులను స్వదేశానికి తరలిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.