యాప్నగరం

పాకిస్థాన్ నుంచి చూసినా కనబడేంత ఎత్తైన జాతీయ జండా

దేశంలోనే అతి ఎత్తైన జాతీయ జండా ఆవిష్కరణకి వేదికైంది అంతర్జాతీయ సరిహద్దుల్లో వున్న అట్టారి బార్డర్...

TNN 6 Mar 2017, 1:25 pm
దేశంలోనే అతి ఎత్తైన జాతీయ జండా ఆవిష్కరణకి వేదికైంది పంజాబ్‌లోని అమృత్‌సర్‌కి సమీపంలోని అట్టారి ఇంటర్నేషనల్ బార్డర్. అంతర్జాతీయ సరిహద్దుల్లో వున్న అట్టారిలో 360 అడుగుల ఎత్తున్న స్తంభంపై ఈ జాతీయ జండాని ఎగరవేశారు. 120 x80 అడుగుల కొలతలతో కూడిన ఈ జాతీయ జండాని ఆదివారం పంజాబ్ రాష్ట్ర మంత్రి అనిల్ జోషి ఆవిష్కరించారు. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో వున్న అనార్కలి బజార్ నుంచి కూడా చూడగలగడం ఈ ఎత్తైన జండా ప్రత్యేకత.
Samayam Telugu indias tallest national flag hoisted at attari border
పాకిస్థాన్ నుంచి చూసినా కనబడేంత ఎత్తైన జాతీయ జండా


రూ.3.5 కోట్ల ఖరీదు చేసే ఈ జాతీయ జండా నిర్వహణ బాధ్యతల్ని ఓ ప్రైవేటు సంస్థకి అప్పగిస్తున్నట్టుగా అమృత్‌సర్ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్ట్ ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.