యాప్నగరం

ఇండిగో సిబ్బంది దౌర్జన్యం.. ప్రయాణికుడిపై దాడి

ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది మరోసారి రెచ్చిపోయారు. ఓ ప్రయాణికుణ్ని ఇండిగో బస్ ఎక్కనివ్వకుండా అడ్డుకున్నారు.

TNN 8 Nov 2017, 11:46 am
ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది మరోసారి రెచ్చిపోయారు. ఓ ప్రయాణికుణ్ని ఇండిగో బస్ ఎక్కనివ్వకుండా అడ్డుకున్నారు. ఇదేంటని ప్రశ్నించడంతో దురుసుగా ప్రవర్తించారు. ప్రయాణికుడు బలవంతంగా బస్సు ఎక్కబోతే కిందపడేసి కొట్టారు. ఈ వీడియో ఇప్పుడు బయటికి రావడంతో మరోసారి ఇండిగో వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే బాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు పట్ల ఇండిగో సిబ్బంది ఒకరు అమర్యాదగా ప్రవర్తించిడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన జరిగిన రెండు రోజులకే ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సిబ్బందికే చెందిన మరో బాగోతం బయటపడటం విశేషం. ఈ ఘటన అక్టోబర్ 15న ఢిల్లీ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది.
Samayam Telugu indigo staff manhandle passenger airline apologises
ఇండిగో సిబ్బంది దౌర్జన్యం.. ప్రయాణికుడిపై దాడి


రాజీవ్ కటియాల్ అనే వ్యక్తి అక్టోబర్ 15న ఇండిగోకు చెందిన 6ఈ 487 విమానంలో ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్నారు. టెర్నినల్ దగ్గరకి వెళ్లడానికి ఇండిగో బస్సు ఎక్కుతున్న రాజీవ్‌ని ఇద్దరు గ్రౌండ్ స్టాఫ్ అడ్డుకున్నారు. దీంతో వారితో రాజీవ్ వాగ్వాదానికి దిగారు. బలవంతంగా బస్సు ఎక్కబోయారు. అంతే ఆయన్ని అక్కడే కింద పడేసి కొట్టారు. అక్కడే ఉన్న మరో ఇండిగో ఉద్యోగి ఈ తతంగాన్ని వీడియో తీశాడు. ఇప్పుడు ఈ వీడియో బయటికి రావడంతో మరోసారి ఇండిగో వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే సింధు విషయంలో జరిగిన తప్పిదానికి తలపట్టుకున్న ఇండిగో సంస్థకు ఇప్పుడు ఈ ఘటన మరింత శిరాభారాన్ని మోపింది.

Also Read: పీవీ సింధూకు కోపం వచ్చింది! ఎందుకో తెలుసా?

తమ సిబ్బంది చేసిన తప్పుకి ఇండిగో సంస్థ క్షమాపణలు చెప్పుకుంది. వెంటనే విచారణ చేపట్టి సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసకుంటామని వెల్లడించింది. మరోవైపు ఈ ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విచారణ చేపట్టి వివరాలు వెల్లడించాలని అధికారులను ఆదేశించారు. ఎయిర్‌లైన్స్ సిబ్బందికి, బాధితుడికి సమన్లు పంపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.