యాప్నగరం

దేశంలో గంటన్నరపాటు స్తంభించిన ఇండిగో సేవలు!

దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ఇండిగో ప్రయాణికులు ఆదివారం నరకయాతన అనుభవించారు. సుమారు గంటన్నర సేపు దేశీయ (డొమస్టిక్) విమాన సేవలు నిలిచిపోయాయి.

Samayam Telugu 7 Oct 2018, 6:24 pm
ఇండిగో విమాన ప్రయాయణికులకు ఆదివారం మధ్యాహ్నం చుక్కలు కనిపించాయి. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ఇండిగోకు చెందిన సాంకేతిక వ్యవస్థ మొత్తం స్తంభించిపోవడంతో ఎక్కడి సేవలు అక్కడ నిలిచిపోయాయి. విమానాశ్రయాల్లోని ఇండిగో కౌంటర్ల ముందు ప్రయాణికులు గంటన్నర సేపు వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పాడింది.
Samayam Telugu Untitledqww


ఇండిగో వ్యవస్థ స్తంభించడం వల్ల 40 శాతం దేశీయ విమానాల ట్రాఫిక్.. 90 నిమిషాల పాటు నిలిచిపోయింది. దీంతో ఇండిగో ప్రయాణికులు సోషల్ మీడియా ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు ట్విట్టర్ ఖాతా.. ఫిర్యాదులతో నిండిపోయింది.

దీనిపై ఇండిగో సంస్థ స్పందిస్తూ.. అన్ని విమానాశ్రయాల్లో మా సిస్టమ్‌లు డౌన్ అయ్యాయి. కౌంటర్ల వద్ద నిత్యం కనిపించే రద్దీ కంటే ఎక్కువ రద్దీ ఉంటుంది. సహనంతో సహకరించగలరని మనవి చేసుకుంటున్నాం’’ అని ట్వీట్ చేసింది. అయితే, సాయంత్రం 5 గంటలకు సమస్య పరిష్కారం కావడంతో యథావిధిగా సేవలు కొనసాగాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.