యాప్నగరం

ఆమె అందరికీ ఆమోదయోగ్యమైన ప్రధాని

ఇందిరాగాంధీ నేటికి అందరికీ ఆమోదయోగ్యమైన ప్రధానమంత్రి అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు

TNN 14 May 2017, 10:18 am
ఇందిరాగాంధీ నేటికి అందరికీ ఆమోదయోగ్యమైన ప్రధానమంత్రి అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ప్రపంచంలో 20వ శతాబ్దంలో ప్రభావితం వారిలో ఆమె ఒకరని ఆయన కొనియాడారు.
Samayam Telugu indira gandhi most acceptable pm even today says president pranab
ఆమె అందరికీ ఆమోదయోగ్యమైన ప్రధాని

శనివారం కాంగ్రెస్ నేత ఆనందర్ శర్మ సంపాదకత్వంలో ఇందిరాగాంధీపై రాసిన ‘ఇండియాస్ ఇందిరా’ పుస్తకాన్ని న్యూఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి అమీద్ హన్సరీ, మాజీ పీఎం మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రణబ్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ చనిపోయి (1984) 33 సంవత్సరాలు గడుస్తున్నా ఆమె అందరికీ ఆమోద్యయోగ్యమైన ప్రధాని అన్నారు. పంజాబ్ లోని స్వర్ణ దేవాలయంలో చేపట్టిన ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ ఆమె తెగువకు నిదర్శమని గుర్తు చేశారు.

1977లో కాంగ్రెస్ పార్టీలో చీలికలు వచ్చినా... 1978 జనవరి 2న అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి..జనవరి 20కల్లా పార్టీ లో అన్ని కమిటీలు పూర్తి చేశారని గుర్తు చేసిన ప్రణబ్.. ఆమె నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలలో గెలిచామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సోనియాగాంధీ పంపించిన ప్రసంగ పాఠాన్ని రాహుల్ చదివి వినిపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.