యాప్నగరం

రాహుల్ గాంధీ ప్రసంగ ‘స్ఫూర్తి’తో రాజీనామా

రాహుల్ గాంధీ స్పీచ్ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీలో ఒక వికెట్ పడింది. గోవా కాంగ్రెస్ వృద్ధనేత తన పదవికి రాజీనామా చేశారు.

Samayam Telugu 20 Mar 2018, 8:04 pm
కాంగ్రెస్ ప్లీనరీలో రాహుల్ గాంధీ స్పీచ్ స్ఫూర్తితో గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ చీఫ్ స్ఫూర్తితో రాజీనామా ఏంటో అర్థం కాలేదా..? ప్లీనరీలో రాహుల్ మాట్లాడుతూ.. నాయకత్వ బాధ్యతలను చేపట్టడానికి యువతరం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దీంతో రాహుల్ మాటలకు విలువిస్తూ.. శాంతారామ్ నాయక్ తన పదవికి రాజీనామా చేశారు. ఈయన ఏప్రిల్ 17న 72వ ఏట అడుగుపెట్టబోతున్నారు.
Samayam Telugu inspired by rahul gandhis speech goa congress president shantaram naik resigns
రాహుల్ గాంధీ ప్రసంగ ‘స్ఫూర్తి’తో రాజీనామా


గతవారం ప్లీనరీలో రాహుల్ మాట్లాడుతూ.. యువతరానికి దారి ఇవ్వాలన్నారు. వయసు మీదపడిన నేతలు పక్కకు తప్పుకోవాలని పరోక్షంగా సూచించారు. దీంతో గత ఏడాది జూలై నుంచి గోవా కాంగ్రెస్ చీఫ్‌గా కొనసాగుతున్న నాయక్ పదవి నుంచి వైదొలిగారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.