యాప్నగరం

ఐఆర్‌సీటీసీ కేసు.. లాలూ కుటుంబానికి ఊరట

ఐఆర్‌సీటీ కేసులో బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌లకు ఊరట లభించింది. కేసులో వారిద్దరికి ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Samayam Telugu 31 Aug 2018, 12:19 pm
ఐఆర్‌సీటీ కేసులో బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌లకు ఊరట దొరికింది. కేసులో వారిద్దరికి ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి కోర్టులో శుక్రవారం విచారణ జరగ్గా.. రబ్రీదేవి, తేజస్వీ యాదవ్‌లు హాజరయ్యారు. తర్వాత న్యాయస్థానం రూ.లక్ష పూచీకత్తు కింద బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలినవారికి కూడా బెయిల్ వచ్చింది. అలాగే ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 6కు వాయిదా వేసింది కోర్టు.
Samayam Telugu Lalu.


ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌‌ (ఐఆర్‌సీటీసీ) హోటళ్లకు సంబంధించిన టెండర్లలో కుంభకోణం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. 2006లో లాలూ రైల్వేశాఖమంత్రిగా ఉన్న సమయంలో రాంచీ, పూరీలో ఈ హోటళ్లను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టినట్లు.. ఈ కాంట్రాక్ట్‌లో అవినీతి, అవకతవకలు జరిగాయట. ఈ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వీ యాదవ్‌తో పాటూ మరికొందరి హస్తం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ హోటళ్ల టెండర్లకు సంబంధించి.. ప్రైవేట్ సంస్థలు లాలూ కుటుంబానికి ఓ ప్లాట్‌ను ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపి ఈడీ.. లాలూతో పాటూ రబ్రీదేవి, తేజస్వీ యాదవ్‌లపై కేసు నమోదు చేశారు. సీబీఐ కూడా కూడా ఈ వ్యవహారంలో ముగ్గురిపై ఛార్జ్‌సీట్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణ జరిపి.. ఇవాళ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాంచీ జైలులో ఉన్న లాలూ మాత్రం శుక్రవారం కోర్టుకు హాజరు కాలేకపోయారు. ఆయన హాజరయ్యేలా ప్రొడక్షన్ వారెంట్‌ ‌జారీ చేయాలని పాటియాలా కోర్టు ఆదేశించగా.. ఆయన్ను అక్టోబరు 6న కోర్టులో హాజరుపరచనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.