యాప్నగరం

ఆసుపత్రి నుంచి ఆశ్రమానికి చేరిన ఇరోమ్

ఏళ్లతరబడి జవహార్ లాల్ నెహ్రూ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో బలవంతంగా ముక్కుద్వారా ఆహారం తీసుకున్న మణిపూర్ ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిల శనివారం విడుదలయ్యారు

TNN 28 Aug 2016, 11:14 am
ఏళ్లతరబడి జవహార్ లాల్ నెహ్రూ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో బలవంతంగా ముక్కుద్వారా ఆహారం తీసుకున్న మణిపూర్ ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిల శనివారం విడుదలయ్యారు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఎత్తివేయాలంటూ ఆమె 16ఏళ్లపాటు ఆమరణదీక్ష చేసి ఆగస్టు 9న విరమించిన సంగతి తెలిసిందే. దీక్ష విరమించినప్పటికీ ఒకేసారి ఆహారం తీసుకోరాదన్న వైద్యుల సలహా మేరకు ఆమె కొన్నాళ్లపాటు హాస్పిటల్ లో నే ఉన్నారు. క్రమపద్ధతిలో ఆహారాన్ని తీసుకుంటున్న షర్మిలను వైద్యులు డిశ్చార్జి చేశారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయని షర్మిల ఇంఫాల్ లోని ఓ ప్రకృతి చికిత్సాలయం (ఆశ్రమం)లో చేరి తాత్కాలికంగా బస చేస్తున్నారు. హాస్పిటల్ నుంచి విడుదలయ్యాక భద్రతా దళాల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆమె నివాళులు అర్పించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటానని ఇరోమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.