యాప్నగరం

పెళ్లి చేసుకోనున్న ఉక్కు మహిళ ఇరోమ్

మానవ హక్కుల ఉద్యమకారిణి, మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల త్వరలో పెండ్లి కూతురు కానున్నారు.

Samayam Telugu 6 May 2017, 9:17 am
మానవ హక్కుల ఉద్యమకారిణి, మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల త్వరలో పెండ్లి కూతురు కానున్నారు. తన స్నేహితుడు, గోవా మూలాలున్న బ్రిటిష్ పౌరుడు డెస్మాండ్ కౌటినోను మనువాడనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా డెస్మాండ్ శుక్రవారం మీడియాకు చెప్పారు.
Samayam Telugu iron lady irom sharmila set to marry her lover desmond
పెళ్లి చేసుకోనున్న ఉక్కు మహిళ ఇరోమ్

‘చట్టప్రకారమైన అనుమతి రాగానే మేం తమిళనాడులో పెండ్లి చేసుకోబోతున్నాం’ అని ఆయన అన్నారు. తమిళనాడులోని మధురై ఏరియాలో పెళ్లి చేసుకోవాలని ఈ జంట భావిస్తోంది. ఇరోమ్, డెస్మండ్ ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్నారు.అయితే పెళ్లి తేదీ ఎప్పుడు అనేది ఇంకా నిర్ణయం కాలేదు.

2011లో తొలిసారి ఇరోమ్, డెస్మండ్ లు కలుసుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత మూడు ముళ్లబంధంతో ఒక్కటి కావాలని చూస్తున్నారు. మణిపూర్‌లో ప్రత్యేక సైనికాధికారాల (AFSPA)చట్టానికి వ్యతిరేకంగా 16 ఏళ్లపాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన షర్మిల... గత ఏడాది ఆగస్టులో దీక్షను విరమించారు. ‘ప్రజా’ అనే స్థాపించి ఇటీవల మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో కొంతకాలం రాజకీయాలకు దూరంగా.. వ్యక్తిగత, మానసిక ప్రశాంతతను కోరుతున్నానని చెప్పారు. షర్మిల పెళ్లి నిర్ణయాన్ని ఆమె కుటుంబ సభ్యులు స్వాగతించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.