యాప్నగరం

కరోనా వైరస్ సోకిందేమోనన్న భయంతో ఐఆర్ఎస్ అధికారి సూసైడ్

కరోనా వైరస్ సోకితే తన వల్ల కుటుంబసభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటారనే భయంతో ఆదాయపు పన్ను విభాగంలో అడిషినల్ డైరెక్టర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.

Samayam Telugu 15 Jun 2020, 10:43 am
కరోనా వైరస్ సోకిందన్న ఆందోళనతో పలువురు బలవన్మరణానికి పాల్పడిన ఘటనలు దేశంలో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, ఢిల్లీలో ఓ ఐఆర్ఎస్ అధికారి కరోనా సోకిందన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన వాహనంలోనే యాసిడ్ తాగి తనువుచాలించాడు. తన వల్ల కుటుంబసభ్యులు ఇబ్బంది పడకూడదనే ఈ తీవ్ర నిర్ణయాన్ని తీసుకున్నట్టు సూసైడ్ నోట్‌‌ రాసిపెట్టి ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం. ఆదివారం ద్వారక జిల్లాలో కారులో ఓ వ్యక్తి స్పృహ కోల్పోయి పడి వున్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని..ఆయనను వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
Samayam Telugu ఐఆర్ఎస్ అధికారి సూసైడ్
Income Tax Officer Suicide


బాధితుడిని ఢిల్లీకి చెందిన ఐఆర్ఎస్ అధికారి శివరాజ్ సింగ్ (56)గా పోలీసులు గుర్తించారు. అయితే, ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగటివ్ రావడం గమనార్హం. కరోనా సోకిందన్న భయంతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన వల్ల తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సూసైడ్ నోట్‌‌లో రాశారని పోలీసులు తెలిపారు. కారులోపల కూర్చుని యాసిడ్ లాంటి రసాయనం తాగినట్టు వివరించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొన్నారు. కుటుంబసభ్యుల నుంచి కూడా వాంగ్మూలం తీసుకుంటామని తెలిపారు. సోమవారం పోస్ట్‌మార్టమ్ పూర్తయిన తర్వాత కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించనున్నారు. ఇక, 2006 ఐఆర్ఎస్ బ్యాచ్‌కు చెందిన శివరాజ్ సింగ్ ఆర్కేపురంలోని ఆదాయపు పన్ను శాఖ విభాగంలో అడిషినల్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.