యాప్నగరం

దక్షిణాసియా శాటిలైట్ ప్రయోగం నేడే!

ప్రపంచంలోనే తొలిసారిగా పొరుగు దేశాల కోసం ఉచితంగా ఉపగ్రహాలు ప్రయోగించిన దేశంగా భారత్ చిరస్థాయిగా నిలిచిపోనుంది. సార్క్ దేశాల...

TNN 5 May 2017, 11:52 am
ప్రపంచంలోనే తొలిసారిగా పొరుగు దేశాల కోసం ఉచితంగా ఉపగ్రహాలు ప్రయోగించిన దేశంగా భారత్ చిరస్థాయిగా నిలిచిపోనుంది. సార్క్ దేశాల పౌర సేవలకు ఉపయోగపడే దక్షిణాసియా ఉపగ్రహం (శాటిలైట్) మరికొద్ది సేపట్లో నింగికేగనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రోజు సాయంత్రం 4.57 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగిస్తారు. ఇంధన ఖర్చును తగ్గించి, ఎక్కువ శాటిలైట్లను తీసుకెళ్లేందుకు వీలుగా జీశాట్-9లో విద్యత్తు చోదక వ్యవస్థను వినియోగిస్తున్నారు.
Samayam Telugu isro all set to launch south asia satellite today
దక్షిణాసియా శాటిలైట్ ప్రయోగం నేడే!


క్షిణాసియా శాటిలైట్ ప్రయోగం కౌంట్ డౌన్ గురువారమే ప్రారంభమైంది. ఈ శాటిలైట్లతో భారత్‌‌తోపాటు అఫ్గానిస్థాన్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంక, మాల్దీవులు లబ్ధిపొందనున్నాయి. తొలుత ఈ పొరుగు దేశమైన పాకిస్థాన్‌ కూడా ఈ ప్రయోగంలో భాగస్వామ్యం పొందేందుకు ఉత్సాహం చూపింది. అయితే, భారత్ ఈ శాటిలైట్ల ద్వారా తమ రహస్య సమాచారాన్ని దొంగిలిస్తుందనే అనుమానాలు వ్యక్తం చేసింది. ఇది కేవలం పౌర అవసరాలను తీర్చే శాటిలైట్లని, వాటి నియంత్రణ బాధ్యతలు ఆయా దేశాలకే అప్పగిస్తామని భారత్ స్పష్టత ఇచ్చినా... పాక్ వక్రబుద్ధితో వెనకడుగు వేసింది. ఆ శాటిలైట్లను తమ సొంత ఖర్చుతోనే ప్రయోగిస్తామంటూ వైదొలిగింది.

దక్షిణాసియా శాటిలైట్ ప్రయోగం ప్రత్యేకతలు ఇవీ...

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.