యాప్నగరం

త్వరలోనే ఇండియాలో హై స్పీడ్ ఇంటర్నెట్

ఇంటర్నెట్ వినియోగంలో అత్యధిక సంఖ్యలో వినియోగదారులున్న దేశంగా భారత్ అమెరికాను అధిగమించి...

TNN 21 May 2017, 10:30 am
ఇంటర్నెట్ వినియోగంలో అత్యధిక సంఖ్యలో వినియోగదారులున్న దేశంగా భారత్ అమెరికాను అధిగమించి చైనా తర్వాత రెండో స్థానంలో నిలిచినప్పటికీ... ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో మాత్రం ఇంకా ఆసియాలో అనేక దేశాలకన్నా వెనుకే వుండిపోయింది. కానీ త్వరలోనే హై స్పీడ్ ఇంటర్నెట్ యుగంలోకి ఇండియా కూడా సగర్వంగా కాలుపెట్టబోతోంది.
Samayam Telugu isro to launch three new satellites to place india in high speed internet era
త్వరలోనే ఇండియాలో హై స్పీడ్ ఇంటర్నెట్


రానున్న కొద్ది రోజుల్లోనే ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మూడు కమ్యునికేషన్ శాటిలైట్స్‌ని అంతరిక్షంలోకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఉపగ్రహాల సేవల ద్వారా మరో 18 నెలల్లో ఇండియాలో ఇంటర్నెట్ స్పీడ్ మరింత ఊపందుకోనుందని ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు.

జూన్ నెలలో జీశాట్-19, ఆ తర్వాత జీశాట్-11, జీశాట్-20 ఉపగ్రహాలని నింగిలోకి పంపించనుంది ఇస్రో. ఆ తర్వాత జీఎస్ఎల్వీఎంకే-III ద్వారా జీశాట్-19ని ప్రయోగించనున్నారు. 4 టన్నుల బరువున్న ఉపగ్రహాన్ని సైతం కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగే సామర్థ్యం వున్న క్రయోజెనిక్ ఇంజిన్ సహాయంతో ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. మల్టిపుల్ స్పాట్ బీమ్స్(శాటిలైట్‌పై వున్న అత్యధిక సామర్థం కలిగిన యాంటెన్నా నుంచి పంపించే శాటిలైట్ సిగ్నల్స్) ద్వారా ఈ ఉపగ్రహాలు దేశం అంతటికీ హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు దోహదపడనున్నాయని ఇస్రో స్పష్టంచేసింది.

జీశాట్ -19 కన్నా అధిక బరువుగల జీశాట్-11ని ఈ ఏడాది చివర్లో ప్రయోగించనున్నారు. దీనికి 16 బీమ్స్ ఉపయోగిస్తున్నారు. ఒక్కో సెకన్‌కి 13 గిగా బైట్ల ఇంటర్నెట్ డేటాను ట్రాన్స్‌ఫర్ చేయగలిగే శక్తిసామర్థ్యాలు ఈ శాటిలైట్ సొంతం. అలాగే 2018 చివరల్లో ప్రయోగించనున్న జీశాట్-20 శాటిలైట్ కోసం 40 బీమ్స్ ఉపయోగిస్తున్నారు. ప్రతీ బీమ్‌కి రెండేసి చొప్పున పోలరైజేషన్స్ కలిగి వుండటం కారణంగా అవి మొత్తం 80 బీమ్స్‌గా రూపాంతరం చెందుతాయి. ఫలితంగా ఒక్కో సెకన్‌కి 60 నుంచి 70 గిగా బైట్ల వేగంతో ఇంటర్నెట్ డేట్ స్పీడ్ ట్రాన్స్‌ఫర్ చేయగల సామర్థ్యం ఈ శాటిలైట్ సొంతమవుతుంది.

ఈ ఉపగ్రహాల సేవలు అందుబాటులోకి వస్తే, ఇక ఇండియాలోనూ ఇంటర్నెట్ స్పీడ్ జెట్ వేగంతో దూసుకుపోనుందన్న మాట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.