యాప్నగరం

కర్ణాటకలో మారుతున్న సమీకరణాలు.. హంగ్ తప్పదట!

పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ కర్ణాటకలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. పోలింగ్‌కు ఇంకా మూడు వారాలే సమయం ఉండటంతో కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నాయి.

Samayam Telugu 24 Apr 2018, 2:59 pm
పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ కర్ణాటకలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. పోలింగ్‌కు ఇంకా మూడు వారాలే సమయం ఉండటంతో కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు కర్ణాటకలో కాంగ్రెస్ మరోసారి అధికారం హస్తగతం చేసుకుంటుందని భావించారు. అయితే ప్రస్తుతం సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు తప్పదంటున్నారు. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక శాసనసభలో ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన కనీసం సంఖ్య 112. అయితే ఈ సంఖ్యను ఏ పార్టీలు చేరుకోలేవని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. హంగ్ తప్పదని, ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్ పాత్ర కీలకం కాబోతుందని స్పష్టం చేస్తున్నాయి.
Samayam Telugu its dead heat in karnataka may 15 could spring a surprise
కర్ణాటకలో మారుతున్న సమీకరణాలు.. హంగ్ తప్పదట!


కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉన్నా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినంత మెజారీటీ రాకపోవచ్చని చెబుతున్నారు. ఏప్రిల్ మధ్య వారంలో జైన్-లోక్‌నీతి సీఎస్‌డీఎస్ చేపట్టిన ప్రీ- పోల్ సర్వేలో ఆశక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే హంగ్ తప్పదని చెబుతోంది. అలాగే కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించినా అధికారం చేపట్టాలంటే మాత్రం జేడీఎస్, లేదంటే స్వతంత్రుల మద్దతు అవసరమని ఇండియా టుడే- కార్వీ ఒపీనియన్ పోల్స్ పేర్కొంది. అదే సమయంలో జీడీఎస్ కనుక బీజేపీకి మద్దతు ఇస్తే, ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉందని తెలిపింది.

సోమవారం విడుదలైన లోక్‌నీతి సీఎస్‌డీఎస్ సర్వే బీజేపీకి 89-95 స్థానాలు, కాంగ్రెస్ 85- 91 స్థానాలు, జేడీఎస్ 32- 38 స్థానాలు, ఇతరులు 6-12 స్థానాల్లో విజయం సాధిస్తారని తెలిపింది. గతంలో కంటే కాంగ్రెస్ ఓట్ల శాతంలో ఎలాంటి మార్పు ఉండబోదని, ఇదే సమయంలో బీజేపీ అదనంగా 3 శాతం ఓట్లు సాధిస్తుందని వెల్లడించింది. అలాగే ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను 30 శాతం మంది, యడ్యూరప్పను 25 శాతం మంది, కుమారస్వామిని 20 మంది ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను జేడీఎస్ చీల్చే అవకాశం ఉందని, 51 శాతం మంది కన్నడిగులు కొత్త సర్కారును కోరుకుంటారని నివేదికలో పేర్కొంది.

ప్రధానిగా రాహుల్ కంటే మోదీనే బెటరని ఓటర్లు అభిప్రాయపడ్డారు. 58 శాతం మంది కన్నడిగులు తమకు ప్రత్యేక జెండా ఉండాలని కోరుకుంటున్నారు. అంతేకాదు టిప్పు సుల్తాన్ కర్ణాటక ముద్దుబిడ్డని 64 శాతం మంది అంగీకరించగా, బహిరంగ ప్రదేశాల్లో హిందీ మాట్లాడడం మంచిదేనని 43 శాతం పేర్కోవడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.