యాప్నగరం

భారత ప్రధాన న్యాయమూర్తిగా జె.ఎస్. ఖేహర్ ప్రమాణం

భారత నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ బుధవారం ప్రమాణ స్వీకారం చేసారు.

TNN 4 Jan 2017, 11:52 am
భారత నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ బుధవారం ప్రమాణ స్వీకారం చేసారు. ఆయనతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణం చేయించారు. జస్టిస్ టి.ఎస్. ఠాకూర్ ఈనెల 3న పదవీవిరమణ చేయడంతో 44వ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఖేహర్ నియమితులయ్యారు. ఖేహర్‌ను తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ గతేడాది డిసెంబర్ 6న ప్రభుత్వానికి సిఫారుసు చేసారు. ఈ మేరకు ఖేహర్ నియమకాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ఆమోదించారు.
Samayam Telugu jagdish singh khehar sworn in as chief justice of india
భారత ప్రధాన న్యాయమూర్తిగా జె.ఎస్. ఖేహర్ ప్రమాణం


కాగా, సిక్కు సామాజిక వర్గం నుంచి దేశ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన మొదటి వ్యక్తిగా జస్టిస్ ఖేహర్ నిలిచారు. ఈ ఏడాది ఆగస్టు 28 వరకు సుమారు ఏడు నెలలపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. 2011 సెప్టెంబర్ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఖేహర్ బాధ్యతలు స్వీకరించారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ న్యాయ నియామకాల కమీషన్ చట్టాన్ని రద్దుచేసిన సుప్రీం కోర్టు బెంచికి జస్టిస్ ఖేహర్ నాయకత్వం వహించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.