యాప్నగరం

జల్లికట్టు: 36 మందికి గాయాల కట్లు!

ఆదివారం తమిళనాడులో నిర్వహించిన జల్లికట్టు క్రీడలో అపశృతి చోటుచేసుకుంది. జల్లికట్టు నిర్వహణలో 36 మంది గాయపడ్డారు.

Samayam Telugu 5 Feb 2017, 5:24 pm
ఆదివారం తమిళనాడులో నిర్వహించిన జల్లికట్టు క్రీడలో అపశృతి చోటుచేసుకుంది. జల్లికట్టు నిర్వహణలో 36 మంది గాయపడ్డారు. ఈ సంఘటన మధురైలోని అవనీయపురంలో జరిగింది. రెవెన్యూ ఆర్.బి. ఉదయ్ కుమార్, జిల్లా కలెక్టర్ వీరరాఘవరావు లాంఛనంగా జల్లికట్టును ప్రారంభించారు.
Samayam Telugu jallikattu 36 people injured in avaniyapuram bull taming sport
జల్లికట్టు: 36 మందికి గాయాల కట్లు!


దాదాపు 900 ఎద్దులు ఈ జల్లికట్టు క్రీడలో పాల్గొన్నాయి. ఈ క్రీడలో గెలుపొందిన ఎద్దులు, వాటిని ఆడించే వారికి బహుమతులుగా సైకిళ్లు, కబోర్డులు, ట్రావెల్ బ్యాగులు, ఇతర వస్తువులు సిద్ధంగా ఉంచారు. అయితే ఈ క్రీడలో 36 మంది తీవ్రంగా గాయపడటంతో బహుమతులు ఇవ్వకుండానే ఆట మధ్యలోనే నిలిపివేశారు.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తమిళనాడులో జల్లికట్టును నిషేదించిన నేపథ్యంలో...మెరీనా బీచ్ లో వేలాది మంది ప్రజలు వారంరోజు పాటు నిషేదం ఎత్తివేతకు పోరాటం చేశారు. దీంతో దిగిచ్చిన రాష్ట్రప్రభుత్వం..జనవరి 23న జల్లికట్టు నిర్వహణకు ఆర్డినెన్స్ ఆమోదించారు. అప్పటి నుంచి రాష్ట్రంలో జల్లికట్టును ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.