యాప్నగరం

జల్లికట్టు: డీఎంకే ఆధ్వర్యంలో రైల్ రోకో

జల్లికట్టు క్రీడపై విధించిన నిషేదం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులో కొనసాగుతున్న ఆందోళనలు నాలుగో రోజుకు చేరుకున్నారు.

TNN 20 Jan 2017, 10:15 am
జల్లికట్టు క్రీడపై విధించిన నిషేదం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులో కొనసాగుతున్న ఆందోళనలు నాలుగో రోజుకు చేరుకున్నారు. జల్లికట్టుపై తక్షణమే ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ డీఎంకే శుక్రవారం చెన్నై సహా ఇతర ప్రాంతాల్లో రైల్ రోకో కార్యక్రమం చేపట్టింది. ఈ ఆందోళనలో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ పాల్గొన్నారు.
Samayam Telugu jallikattu dmk stages rail rokho at egmore railway station
జల్లికట్టు: డీఎంకే ఆధ్వర్యంలో రైల్ రోకో


తమిళ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవించి..తక్షణమే జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ వద్దకు చేరిన వందలాది మంది డీఎంకే కార్యకర్తలను నిలువరించేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. పోలీసులు డీఎంకే కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.

అటు చెన్నైలో బంద్ కొనసాగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.