యాప్నగరం

సంబరంగా జల్లికట్టు ప్రారంభం

తమిళునాడులోని సంప్రదాయ క్రీడ జల్లికట్టు సంబరం మళ్లీ మొదలైంది.

Samayam Telugu 29 Jan 2017, 1:12 pm
తమిళునాడులోని సంప్రదాయ క్రీడ జల్లికట్టు సంబరం మళ్లీ మొదలైంది. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేస్తూ తమిళనాడు ప్రభుత్వం బిల్లును ఆమోదించిన నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జల్లికట్టు ప్రారంభమైంది. ఆదివారం స్థానికులు జల్లికట్టు క్రీడను ఘనంగా నిర్వహించారు. పోలీసుల భారీ బంబోబస్తు నడుమ ఈ క్రీడ కొనసాగుతోంది. క్రీడలో భాగంగా సంప్రదాయబద్ధంగా ముస్తాబుచేసిన ఎద్దులను అదుపుచేసేందుకు యువకులు పోటీ పడ్డారు.
Samayam Telugu jallikattu tamil nadu kicks off bull taming sport
సంబరంగా జల్లికట్టు ప్రారంభం



జంతువులను సంప్రదాయం పేరుతో హింసించరాదని జంతు కారుణ్య సంస్థ ‘పెటా’ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో 2014లో జల్లికట్టుపై నిషేదం విధించింది. దీనిపై తమిళనాడులో పెద్ద ఎత్తున ఉద్యమం మొదలైంది. ఈ యేడాది పొంగల పండగ సందర్భంగా పలు చోట్లా సుప్రీంకోర్టు నిషేదాన్ని తోసిరాజంటూ జల్లికట్టు నిర్వహించారు. చెన్నై మెరీనా బీచ్ కేంద్రంగా వారంరోజుల తమిళనాడు ప్రజానీయక తీవ్రపోరాటం చేసింది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జల్లికట్టుకోసం ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.