యాప్నగరం

నూతన కాగ్‌గా ముర్ము.. జమ్మూకశ్మీర్‌కు ‘వికాస్ పురుష్’

Jammu Kashmir Lieutenant Governor: జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన వెంటనే జీసీ ముర్మును నూతన కాగ్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. యూపీ బీజేపీ నేత జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ పదవి దక్కింది.

Samayam Telugu 7 Aug 2020, 2:57 pm
హించినట్టే జమ్ము కశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ గిరీష్ చంద్ర ముర్ము.. భారత కొత్త కాగ్‌గా నియమితులయ్యారు. జమ్ము కశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజే (ఆగస్టు 6) ఈ నియామకం జరగడం గమనార్హం. బుధవారం రాత్రే ఆయన తన రాజీనామాను రాష్ట్రపతికి పంపిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను ఆమోదించడం భారత నూతన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌ (కాగ్)గా నియామక ఉత్తర్వులు ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఆయన రాజీనామా సమర్పించిన వెంటనే నూతన కాగ్‌గా నియామకం పొందనున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి.
Samayam Telugu జీసీ ముర్ము
Comptroller and Auditor General of India


ప్రస్తుత కాగ్ రాజీవ్ మెహరిషి పదవీ కాలం ఈవారంలోనే ముగియనుంది. ఆగస్టు 8తో ఆయన 65వ పడిలోకి అడుగుపెడుతున్నారు. దీంతో ఆయన పదవీ కాలం ముగుస్తోంది. రాజీవ్ కాగ్ పదవి నుంచి తప్పుకున్న వెంటనే జీసీ ముర్ము ఆ బాధ్యతలను చేపట్టనున్నారు. కాగ్ రాజ్యాంగబద్దమైన పదవి కాబట్టి.. ఆ స్థానం ఖాళీగా ఉండకూదు. ఈ నేపథ్యంలో వెంటనే కొత్త కాగ్‌ను నియమించారు.

ముర్ము 1985 బ్యాచ్ గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి. కేంద్ర ఆర్థిక శాఖలో వ్యయ విభాగం కార్యదర్శిగా పదవీ విరమణ చేయకముందే జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్‌గా నియమితులయ్యారు.

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బీజేపీ సీనియర్‌ నేత మనోజ్‌ సిన్హా (61)ను జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు వికాస్‌ పురుష్‌గా పేరుంది. మనోజ్‌ సిన్హా మూడుసార్లు లోక్‌సభకు ఎంపికయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.