యాప్నగరం

కానిస్టేబుల్‌ను కాల్చి చంపిన టెర్రరిస్టులు.. కుమార్తెకు బుల్లెట్ గాయం

జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఇంకో పోలీస్ కానిస్టేబుల్‌పై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ దాడిని పోలీసులు పూర్తిగా ఖండించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 24 May 2022, 8:51 pm

ప్రధానాంశాలు:

  • శ్రీనగర్ జిల్లాలో పోలీసు‌పై కాల్పులు
  • ఉగ్రవాదుల దాడిలో సైఫుల్లా ఖాద్రీ మృతి
  • సైఫుల్లా ఖాద్రీ కుమార్తెకు తీవ్ర గాయాలు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu కానిస్టేబుల్‌ను కాల్చి చంపిన టెర్రరిస్టులు.. కుమార్తెకు బుల్లెట్ గాయం
జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లాలో సౌరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను హతమార్చారు. అంచర్‌లోని కానిస్టేబుల్ ఇంటి వెలుపల టెర్రరిస్టులు వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ ఏడేళ్ల కుమార్తె కూడా గాయపడింది. సైఫుల్లా ఖాద్రీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడని జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. తన కుమార్తెను ట్యూషన్ క్లాస్‌కి దింపేందుకు ఇంటి నుంచి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఈ దాడి జరిగిందని వెల్లడించారు.
ఈ కాల్పుల్లో గాయపడిన పోలీస్ కానిస్టేబుల్‌ సైఫుల్లా ఖాద్రీని, అతని కుమార్తెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఖాద్రీ మృతి చెందాడు. దీంతో ఆ అమరవీరుడికి నివాళులు అర్పిస్తున్నామని, ఆ కుటుంబానికి అండగా ఉంటామని జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు. అలాగే చిన్నారి కుడి చేతికి బుల్లెట్ గాయమైందని, అయితే పాపకు ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.

అయితే ఈ దాడిని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ ఖండించారు. ఆ ఉగ్రవాదుల కోసం పోలీసు బృందాలు రంగంలోకి దిగాయని, త్వరలో పట్టుకుంటామని ఆయన చెప్పారు. ఈ నెలలో కశ్మీర్‌లో ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్న మూడో పోలీస్ కానిస్టేబుల్ ఖాద్రీ. అంతకుముందు మే 7న అంచర్ ప్రాంతానికి సమీపంలోని ఐవా వంతెన వద్ద ఉగ్రవాదులు ఒక పోలీసులను కాల్చి చంపారు. మే 13న పుల్వమా జిల్లాలో మరో పోలీసు మరణించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.