యాప్నగరం

జయలలిత పరిస్థితి ఏంటి ?

అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి చనిపోయింది. అమ్మ ఇక లేరు, జయలలిత అందరినీ విడిచి వెళ్లిపోయారు అని తమిళనాడులో కొన్ని లోకల్ ఛానెల్స్ సోమవారం సాయంత్రం నుంచే వార్తలు ప్రసారం చేశాయి...

TNN 5 Dec 2016, 7:30 pm
అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి చనిపోయింది. అమ్మ ఇక లేరు, జయలలిత అందరినీ విడిచి వెళ్లిపోయారు అని తమిళనాడులో కొన్ని లోకల్ ఛానెల్స్ సోమవారం సాయంత్రం నుంచే వార్తలు ప్రసారం చేశాయి. ఇదే వార్తను మిగతా తమిళ ఛానెల్స్ కూడా ప్రసారం చేశాయి. దీంతో ఏ వార్త నిజం అనే దానిపట్ల తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో జయ ఆరోగ్య పరిస్థితి కోసం ఎదురు చూస్తున్న ఆమె అభిమానులు, తమిళ ప్రజలు ఒక్కసారిగా సంయమనం కోల్పోయారు. అపోలో ఆసుపత్రి వద్ద విధ్వంసానికి దిగారు.
Samayam Telugu jayalalitha death rumours and the suspense continuing on amma current health condition
జయలలిత పరిస్థితి ఏంటి ?


ఈ నేపథ్యంలోనే అప్పటికప్పుడు అపోలో ఆసుపత్రి యాజమాన్యం టీవీల్లో వచ్చే పుకార్లను నమ్మొద్దు అంటూ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ప్రస్తుతం అపోలో ఆసుపత్రి వద్ద మరియు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అందరూ జయలలితకు సంబంధించిన ఎలాంటి చిన్న వార్తకైనా స్పందిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా అపోలోలో చికిత్స పొందుతున్న రోగులను తరలిస్తున్నారు. పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు, విద్యాసంస్థలు ఇతర అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు మూసివేశారు. ప్రజల్లో ఉద్వేగాలు పెరుగుతున్న నేపథ్యంలో జయలలితపై అధికారక ప్రకటన ఇచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు వెనుకంజ వేస్తున్నారు. అసలు జయలలిత పరిస్థితి ఏంటి? అనేదానిపై ఎలాంటి సమాచారం ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు రానివ్వడం లేదు.

మరోవైపు జయలలిత హాస్పిటల్ బెడ్ పై పడుకొని ఉన్న ఫోటోలను ఫేస్బుక్, ట్విట్టర్ లలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే RIP అమ్మ, RIP జయలలిత అంటూ లక్షల సంఖ్యలో ట్వీట్లు వస్తున్నాయి. అయితే జయకు సంబంధించిన ఎలాంటి ఫోటోగానీ, సమాచారం కానీ ఇంతవరకు అధికారికంగా బయటకు వెల్లడించలేదు. సోషల్ మీడియాలో జయలలితకు సంబంధించిన ఫోటోలు, వార్తలు అన్నీ ఫేక్ అని గ్రహించాలి. ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న ఫోటో కూడా నిజమైంది కాదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.