యాప్నగరం

త్వరలో... విధుల్లోకి జయలలిత

జయలలిత ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నట్టు అన్నా డీఎంకే పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు

TNN 3 Nov 2016, 2:58 pm
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నట్టు అన్నా డీఎంకే పార్టీ అధికార ప్రతినిధి ఎస్.రామచంద్రన్ తెలిపారు. ఆమె త్వరలోనే తిరిగి విధుల్లో చేరుతారని చెప్పారు. ప్రస్తుతం జయ ఆహారం సొంతంగా తీసుకుంటున్నారని, అయితే ఇంకా కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణ తప్పదని తెలిపారు. సెప్టెంబర్ 22న జయ జ్వరం, డీ హైడ్రేషన్, ఊపిరితిత్తుల సమస్యలతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అప్పట్నించి ఇప్పటివరకు చికిత్స సాగుతూనే ఉంది.
Samayam Telugu jayalalithaa doing well will join her duty soon aiadmk
త్వరలో... విధుల్లోకి జయలలిత


లండన్, ఢిల్లీ ఎయిమ్స్ నుంచి ఊపిరితిత్తుల వైద్యులు వచ్చి చికిత్స చేశారు. నిత్యం అపోలో ఆసుపత్రిలో ఓ వైద్య బృందం జయ వార్డులోనే తిష్ట వేశారు. ఆమె కోలుకోవాలని ఆసుపత్రి బయట కార్యకర్తలు, అభిమానులు పూజలు, హోమాలు చేశారు. మొక్కులు తీర్చుకున్నారు. వారి పూజలు ఫలించే జయలలిత ఆరోగ్యం కుదుటపడిందని అన్నా డీఎంకే పార్టీ అధికార ప్రతినిధి రామచంద్రన్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.