యాప్నగరం

అమ్మకు కన్నీటి వీడ్కోలు: అంత్యక్రియలు పూర్తి

జయలలిత అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాల మధ్య పూర్తయ్యాయి.

TNN 6 Dec 2016, 7:12 pm
జయలలిత అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాల మధ్య పూర్తయ్యాయి. అభిమానులు అశ్రునయనాలతో తమ అభిమాన నేతకు వీడ్కోలు పలికారు. మెరీనా బీచ్‌కు చేరుకున్న అమ్మ పార్ధివ దేహంపై ఇన్ ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు పుష్ప గుచ్ఛం ఉంచారు. మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ అధికారులు గౌరవ వందనాన్ని సమర్పించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వంతో పాటూ పలువురు నేతలు అమ్మ పార్థివదేహానికి పుష్పాలు అర్పించి నమస్కరించారు. తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య పుష్ప గుచ్చాన్ని ఉంచి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నాయకుడు గులామ్ నబీ ఆజాద్ తదితరులు దివంగత నేతకు నమస్కరించారు.
Samayam Telugu jayalalithaas last rites performed at marina beach
అమ్మకు కన్నీటి వీడ్కోలు: అంత్యక్రియలు పూర్తి


పురోహితులు జయ ప్రియనేస్తం శశికళ, దత్త పుత్రుడు సుధాకరన్ చేత అంతిమ సంస్కారాలు పూర్తి చేయించారు. అమ్మ పార్థివ దేహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించిన గంధపు చెక్క పేటికతో సహా ఖననం చేశారు. ఆ సమయంలో మెరీనా బీచ్ శోకసంద్రమైంది. ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. అమ్మకు కన్నీటి వీడ్కోలు పలికారు ప్రజలు.


అమ్మకు కన్నీటి వీడ్కోలు: అంత్యక్రియలు పూర్తి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.