యాప్నగరం

ఇవాళ సాయంత్రం జయలలిత పార్ధీవదేహానికి అంత్యక్రియలు

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర ప్రజలకు తిరుగులేని పాలనను అందించి, వారి హృదయాల్లో 'అమ్మ'గా చెరగని

TNN & Agencies 6 Dec 2016, 6:01 am
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర ప్రజలకు తిరుగులేని పాలనను అందించి, వారి హృదయాల్లో 'అమ్మ'గా చెరగని ముద్రవేసుకున్న జయలలిత ఆదివారం అర్ధరాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. జయలలిత మృతితో యావత్ తమిళనాడు శోకసంద్రంలో మునిగిపోయింది. ఆరుసార్లు ముఖ్యమంత్రిగా తమకు చక్కటి పాలన అందించిన అమ్మ ఇక తమకు లేరని తెలిసి తమిళ ప్రజలు తట్టుకోలేకపోతున్నారు.
Samayam Telugu jayalalithaas last rites to be performed today at marina beach in chennai
ఇవాళ సాయంత్రం జయలలిత పార్ధీవదేహానికి అంత్యక్రియలు


ఇదిలావుంటే, మరోవైపు మంగళవారం సాయంత్రం, అంటే ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు జరగనున్న జయలలిత అంత్యక్రియలకు ఏర్పాట్లు సైతం మొదలయ్యాయి. మరీనా బీచ్‌కి సమీపంలోని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే పార్థీ వ్యవస్థాపకులు ఎం.జీ. రామంచంద్రన్ సమాధి చెంతనే జయలలిత భౌతిక కాయానికి కూడా అంత్యక్రియలు జరగనున్నాయి. అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజల సందర్శనార్థం రాజాజీ హాలులో జయలలిత పార్ధీవ దేహాన్ని ఉంచనున్నారు. ఇవాళ సాయంత్రం అక్కడి నుంచే అమ్మ అంతిమయాత్ర ప్రారంభం కానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.