యాప్నగరం

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన దీప

అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళనుదోషిగా ప్రకటించడాన్ని దివంగత

Samayam Telugu 7 Dec 2022, 2:02 pm
అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళను దోషిగా ప్రకటించడాన్ని దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ స్వాగతించారు. అవినీతికి పాల్పడిన శశికళను జైలుకు పంపించడం స్వాగతించాల్సిన విషయం అని దీప అన్నారు. తాను మొదటి నుంచి శశికళ అవినీతిపరురాలు అని చెబుతూనే ఉన్నానని పేర్కొన్నారు.
Samayam Telugu Deepa Jayakumar


ప్రస్తుతం అన్నాడీఎంకేలో చోటుచేసుకున్న అంశాలపై తన మద్దతుదారులతో చర్చిస్తానని చెప్పిన దీప..త్వరలో రాజకీయ నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. శశికళ జైలుకెళ్లడం అన్నాడీఎంకే కార్యకర్తలు, తమిళనాడు ప్రజలకు గుడ్ న్యూస్ అని ఆమె అభివర్ణించారు.

అటు అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన పళనిస్వామిపై దీప విమర్శలు గుప్పించారు. జయలలిత పళనిస్వామిని పార్టీ నుంచి గతంలో బహిష్కరించారని అలాంటి వ్యక్తిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడం శశికళ తనను తాను రక్షించుకోవడం కోసమేనని ఆరోపించారు. పార్టీలో ఆమె వర్గీయులదే పెత్తనం అని దీప విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.