యాప్నగరం

జియో షాక్ : ఎయిర్‌టెల్ ఉచిత ప్లాన్లు

జియో ఇచ్చిన షాకుతో ఎయిర్‌టెల్ సంస్థ కూడా తన ఆఫర్ల విషయంలో కాస్త దిగివచ్చింది.

TNN 8 Dec 2016, 2:05 pm
దేశీయ టెలికామ్ సంస్థలకు రిలయన్స్ జియో ఇచ్చిన షాక్ ఇంతా అంతా కాదు. మొన్నటి వరకు వినియోగదారులను దోపిడీకి తక్కువ, చార్జీల బాదుడుకు ఎక్కువనే రేంజీలో వీరబాదుడు బాదేసిన టెలీకాం సంస్థలు నెమ్మదిగా దిగివస్తున్నాయి. ఇప్పుడు భారతీ ఎయిర్‌టెల్ సంస్థ కూడా జియో బాటలో నడవాలని నిర్ణయించి ఫ్రీ డేటా, ఫ్రీ కాల్స్ పేరిట రెండు ప్రీపెయిడ్ ఆఫర్లను గురువారం ప్రకటించింది.
Samayam Telugu jio effect bharti airtel annouces two free calling and data offers
జియో షాక్ : ఎయిర్‌టెల్ ఉచిత ప్లాన్లు


రూ.345 ప్యాక్‌తో ప్రీపెయిడ్ కస్టమర్లు దేశంలో ఏ నెట్‌వర్కుకు అయినా ఉచితంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. దాంతోపాటు 1 జిబి డేటాను ఉచితంగా ఇస్తారు. వ్యాలిడిటి 28 రోజులు.

అలాగే రూ.145 ప్యాకుతో దేశ వ్యాప్తంగా ఎయిర్‌టెల్ టు ఎయిర్‌టెల్ కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చు. దీనికి 300 ఎంబీ 4జి డేటా ఉచితంగా ఇస్తారు. దీని వ్యాలిడిటి 28 రోజులు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.