యాప్నగరం

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదుల హతం..

అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే జాతీయ రహదారిని పర్యవేక్షిస్తున్న ఆర్మీ పెట్రోలింగ్ గ్రూప్‌పై ఆదివారం (జూన్ 24) మధ్యాహ్నం ఉగ్రవాదులు ఒక్కసారిగా దాడికి దిగారు.

Samayam Telugu 24 Jun 2018, 7:29 pm
జమ్ముకశ్మీర్‌‌లోని కుల్గాం జిల్లాలోని చద్దర్‌ ప్రాంతంలో ఆదివారం (జూన్ 24) మధ్యాహ్నం ఎన్‌కౌంటర్‌ జరిగింది. కుల్గాం ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో బరిలోకి దిగిన రాష్ట్రీయ రైఫిల్స్‌ బెటాలియన్‌, సీఆర్‌పీఎఫ్‌, జమ్ముకశ్మీర్‌ పోలీసులకు చెందిన ఎస్‌వోజీ బృందాలు క్యూమోహ్‌ ప్రాంతంలో తనిఖీలు చేపట్టాయి. దీంతో చద్దర్‌ ప్రాంతంలో వీరిపైకి ఉగ్రవాదులు దాడికి దిగారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు వారిపై ఎదురుకాల్పులు చేపట్టారు . దీంతో లష్కరే తొయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మిగిలిన ఉగ్రవాది బలగాలకు లొంగిపోయాడు.
Samayam Telugu JK


జూన్ 28 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమవుతున్న నేపథ్యంలో... ఆ మార్గంలోనే ఈ ఎన్‌కౌంటర్ జరగటం భద్రతా బలగాలను కలవరపెడుతోంది. ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో కుల్గాం జిల్లాలో ఇంటర్నెట్‌, ఫోన్ సేవలను నిలిపివేశారు. అయితే ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోగా.. ఒక ఉగ్రవాది భద్రతా బలగాలకు లొంగిపోయినట్లు.. డీజీపీ వైద్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేసిన భద్రతా దళాలను ఆయన అభింనందించారు.


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.