యాప్నగరం

కశ్మీరీ యువత ప్రాధాన్యం మారుతోందా?

నిన్న మొన్నటిదాకా భద్రతా బలగాలపై రాళ్లు రువ్విన వాళ్లే చేతిలో లాఠీ పట్టుకుని శాంతిభద్రతల పరిరక్షణకు సిద్ధపడుతున్నారు. ఇది ప్రస్తుత కశ్మీర్ యువతలోని మార్పు

Samayam Telugu 14 May 2017, 11:40 am
కశ్మీర్ యువత ఆలోచనా విధానంలో క్రమంగా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. నిన్నటిదాకా జవాన్లపై రాళ్లు రువ్వినవారే నేడు పోలీసు ఉద్యోగాలకు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. నాలుగు రోజుల కింద ఆర్మీకి చెందిన యువ అధికారి లెఫ్టినెంట్ ఉమర్ ఫైయాజ్‌‌‌ను హిజ్బుల్ ముజాయిద్దీన్ తీవ్రవాదులు అపహరించి హత్యచేసిన విషయం తెలిసిందే. భద్రతదళాలల్లో చేరే కశ్మీరీ యువతకు హెచ్చరికగా ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడ్డారు. అయితే వారి హెచ్చరికలను బేఖాతరు చేస్తూ జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం ప్రకటించిన 698 ఎస్సై పోస్టులకు ఏకంగా 67,218 మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం.
Samayam Telugu jk youths defy terrorists 67000 apply for 700 cop jobs
కశ్మీరీ యువత ప్రాధాన్యం మారుతోందా?


వీటికి సంబంధించిన ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ప్రారంభమైంది. శనివారం శ్రీనగర్‌లోని భక్షి స్టేడియంలో 2 వేల మంది యువతీయువకులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారు. పోలీస్ ఉద్యోగాల్లో చేరవద్దని వివిధ తీవ్రవాద సంస్థల హెచ్చరికలను పెడచెవిని పెడుతూ యువత పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. కశ్మీరీ యువతను బెదిరిస్తూ అనేక వీడియోలను ఉగ్రవాదులు విడుదల చేస్తూన్నా వాటిని పట్టించుకోకుండా అధిక సంఖ్యలో పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారు.

ఇలా దరఖాస్తు చేసుకున్న వారిలో 35,722 మంది కశ్మీరీ ప్రాంతం నుంచి, 31,496 మంది జమ్ము ప్రాంతం నుంచి ఉన్నారు. సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులకు 6 వేల మంది అమ్మాయిలు కూడా దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొంటారని జమ్మూ కశ్మీర్ డీజీపీ ఎస్పీ వేద్ తెలిపారు. సంప్రదాయిక సంకెళ్లను దాటి వందలాది మంది కశ్మీరీ యువతులు ఇందులో పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు. తీవ్రవాదం వల్ల కశ్మీర్‌లో మహిళల పరిస్థితి దారుణంగా ఉందని ఓ యువతి పేర్కొంది.

లోయలో పోలీసులకు నిరంతరం ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉంది.... అయినా కానీ దీన్ని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నానని మహ్మద్ రఫీక్ భట్ అనే యువతి తెలిపింది. అంతే కాదు తీవ్రవాదం అనే వ్యాధికి సరైన మార్గంలో చికిత్స అవసరమని వ్యాఖ్యానించింది. పోలీస్ ఉద్యోగం వస్తే నా అంత అదృష్టవంతురాలు ఉండరు... సమాజంలో మంచి గౌరవం లభిస్తుందని ఫర్జానా అనే యువతి తెలియజేసింది. సమాజం ఎదుర్కొంటున్న దురాగతాలను ఎదిరించడానికి అవకాశం ఉంటుందని శ్రీనగర్‌కు చెందిన రుబీనా అక్తర్ అనే యువతి వివరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.